OTT Movie : సినీ ఇండస్ట్రిలో జరిగే అరాచకాలు తెలుసుకోవాలంటే ఈ ఒక్క సిరీస్ చాలు.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోందంటే?

OTT Movie : సినిమా పరిశ్రమలో జరిగే రాజకీయాలు, బంధుప్రీతి, కాస్టింగ్ కౌచ్ ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటారు. కానీ ఇవన్నీ హాట్‌స్టార్ షోలో చూపించినట్లుగా ఎప్పుడూ తెరపై చూపించలేదు. ఇలాంటి సినిమా గానీ, సిరీస్ గానీ  చేయడానికి చాలా ధైర్యం అవసరం. ఎందుకంటే ఇండస్ట్రీలోని నిజాలు బయటపెడితే ఇండస్ట్రీ పెద్దలకు కోపం వస్తుందేమో, అవకాశాలు కరువు అవుతాయేమో అనే భయం ఉంటుంది. కానీ రీసెంట్ గా ఓ సిరీస్ ద్వారా ఆ సీక్రెట్స్ అన్నింటినీ రివీల్ చేశారు మేకర్స్. ఆ సిరీస్ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? అనే విషయంలోకి వెళ్తే..

డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో..

సినీ ఇండస్ట్రిలో జరిగే అరాచకాలు తెలుసుకోవాలంటే ఈ ఒక్క సిరీస్ చాలు. నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హష్మి, మహిమా మక్వానా, మౌని రాయ్, రాజీవ్ ఖండేల్వాల్, శ్రేయ శరణ్, విజయ్ రాజ్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ పేరు షోటైమ్‌. దీనికి సంబంధించిన అన్ని ఎపిసోడ్‌లు  డిస్ని ప్లస్ హాట్‌ స్టార్‌లో విడుదలయ్యాయి. ఇక ఈ సిరీస్ లో ప్రతి కొన్ని నిమిషాలకు మీరు ఇప్పటిదాకా సినిమా ఇండస్ట్రి గురించి విన్న ఏదో ఒక విషయాన్ని చూస్తారు. కానీ కథ ఇంతకు మించి ఉంటుంది. ఇండస్ట్రీలోని రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ విధంగా ఈ సిరీస్‌ను రూపొందించినందుకు ఆయనను మెచ్చుకుని తీరాల్సిందే. మరుగున పడిన అనేక సత్యాలను ఇందులో చూపించాడు. కొన్ని చోట్ల ఈ సిరీస్ నెమ్మదిగా సాగుతుంది. అయితే పెద్ద రాజకీయ కుట్రలు అభివృద్ధి చెందడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇది అవసరమే అన్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం మీద ఇంట్రెస్టింగ్ గా సాగే ఈ సిరీస్ ను ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

,

- Advertisement -

కథ

నసీరుద్దీన్ షా సినిమా నిర్మాణ సంస్థకు సంబంధించిన స్టూడియోను తన కొడుకు ఇమ్రాన్ హష్మీ చూసుకుంటాడు. కానీ ఆయన తీసిన సినిమాలు పెద్దగా ఆడవు. అయితే నసీరుద్దీన్ తన కొడుకు తీసే పనిమాలిన సినిమాలను చూసి తన పేరు, తన నిర్మాణ సంస్థ పేరు చెడిపోతుందని బాధ పడతాడు. ఇక తండ్రి కొడుకులకు ఒక్క క్షణం కూడా పడదు. దీంతో తన వారసత్వంగా ఆ స్టూడియోను ఇమ్రాన్ కు ఇవ్వకుండా, తన మనవరాలు మహిమా మక్వానాకు ఇస్తాడు. దీంతో వీరిద్దరి మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇమ్రాన్ మహిమను ఎలాగైనా నాశనం చేయాలని చాలా రాజకీయాలు చేస్తాడు. మరి సూపర్ స్టార్ రాజీవ్ ఖండేల్వాల్ ఎవరికి మద్దతు ఇస్తాడు? వీరిద్దరి పోరులో ఎవరు నాశనమవుతారు? చివరికి గెలిచింది ఎవరు? సినీ పరిశ్రమలోని ఏ చీకటి రహస్యాలు బయటపడ్డాయి వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి ఈ సిరీస్ చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు