OTT Movie : చావును సెలబ్రేట్ చేసుకునే వింత ఫ్యామిలీ… పగవాడికి కూడా ఇలాంటి పరిస్థితి రావొద్దు

OTT Movie : ప్రస్తుతం ఓటీటీలో మిస్టరీ సస్పెన్స్, హారర్ సినిమాలతో పాటు డార్క్ కామెడీ సినిమాలకు కూడా ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే డార్క్ కామెడీ మూవీస్ కు మంచి ఆదరణ పెరుగుతుంది. ఇక తాజాగా మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఈ జానర్ లోదే. అయితే పెద్దగా ట్విస్టులు లేకపోయినా నెక్స్ట్ సీన్ లో ఏం జరగబోతుందా అనే ఆసక్తిని మాత్రం పెంచేసే ఈ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఈ సినిమా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సాధారణంగా చావు అనే మాట వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కానీ సినిమాలో మాత్రం ఏకంగా ఓ ఫ్యామిలీ చావబోతున్నాం అని తెలిసి కూడా సెలబ్రేట్ చేసుకుంటుంది. పైగా అక్కడ జనాలు చనిపోవడానికి ప్రభుత్వమే దగ్గర ఉండి మందులు పంచుతుంది. మరికొన్ని క్షణాల్లో చనిపోతున్నాం అని తెలిసినా ప్రజలంతా పార్టీ చేసుకోవడం అంటే విడ్డూరమే కదా. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ పేరు సైలెంట్ నైట్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Silent Night (2021) Review | Dark Genre Hybrid AMC+ | Heaven of Horror

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమాలో నెల్, సైమన్ ఇద్దరూ భార్య భర్తలు. వాళ్లకి ముగ్గురు పిల్లలు ఉంటారు. అందులో ఆర్ట్ కూడా ఒకడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతుండడంతో ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. ఆ పార్టీకి ఈ ఫ్యామిలీతో పాటు మరో ముగ్గురు కపుల్స్ కూడా హాజరవుతారు. అందులో ఒకరికి కూతురు ఉంటుంది. క్రిస్మస్ పార్టీ అంటే ఎంత హడావిడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ వీళ్ళ ఇంట్లో మాత్రం ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు. ఇక పార్టీకి హాజరైన కిట్టి అనే అమ్మాయి, వీళ్ళ కొడుకు అయిన ఆర్ట్ అనే అబ్బాయి ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. కానీ వాళ్లను ఎవ్వరూ ఆపరు. ఇక డిన్నర్ టైంలో కూడా ఎవరు కడుపు నిండా ఆహారం తినరు. మరోవైపు విషపూరిత గ్యాస్ లీకేజ్ కారణంగా చాలా మంది చనిపోతారు. ఆ గ్యాస్ ను ఆపడానికి ఎంత ప్రయత్నించినా కంట్రోల్ కాదు. దీంతో ఆ గ్యాస్ వల్ల బాధపడుతూ చనిపోవడం కంటే ఎలాంటి నొప్పి లేకుండా ముందే చనిపోవడం బెటర్ అని అందరూ ఫీల్ అవుతారు. ఇక ఆ గ్యాస్ ను కట్టడి చేయాల్సిన ప్రభుత్వమే ఏకంగా జనాలు చనిపోవడానికి ఎగ్జిట్ పిల్స్ అనే పేరుతో మందులు ఇస్తుంది. ఎలాంటి బాధను అనుభవించకుండా చనిపోవాలి అనుకున్న వాళ్ళు వాటిని వేసుకుని చనిపోతారు. వీటి కోసమే సైమన్, నెల్ ఈ పార్టీని ఏర్పాటు చేస్తారు. ఆ పార్టిలో ఈ మందుతో ఫ్యామిలీ అంతా చావలి అని డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళ కొడుకు మాత్రం ఆ మందును వేసుకోవడానికి ఒప్పుకోడు. మరి చివరికి ఈ ఫ్యామిలీ చనిపోయిందా? ఆ గ్యాస్ రిలీజ్ కాకుండా ఎవరైనా ఆపగలిగారా? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సైలెంట్ నైట్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు