OTT Movie : అనబెల్లెకు అక్కలాంటి హార్రర్ మూవీ… ఒంటరిగా చూసే దమ్ముందా?

OTT Movie :  సూపర్ నేచురల్ హారర్ ఫిలిమ్ జానర్లో వచ్చే కొన్ని సినిమాలు చూడాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ సినిమాలు చూశాక ఎక్కడ దయ్యం మనల్నే చూస్తుందో ? వెంటాడుతుందో ? అన్నంతగా భయపెడతాయి. ఇలాంటి సినీమాటిక్ ఫీలింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే క్రేజీ మూవీ లవర్స్ ఎందరో. అలాంటి వారి కోసమే ఈ రోజు మన ఈ మూవీ సజెషన్. మరి అంతలా భయపెట్టే ఈ మూవీ పేరేంటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ హారర్ జానల్ మూవీ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా భయపెట్టే సినిమాలను అందరూ చూడలేరు. కాబట్టి హార్ట్ వీక్ గా ఉండేవాళ్ళు ఈ మూవీకి దూరంగా ఉండడం మంచిది. 2018లో విడుదలైన ఈ సూపర్ నేచురల్ మూవీ అనబెల్ మూవీకి అక్కలా ఉంటుంది. ఎంతో ధైర్యం ఉంటే తప్ప ఒంటరిగా చూసి ధైర్యం చేయకండి. ఇక విషయంలోకి వెళ్తే ఇదొక ఇండోనేషియన్ హర్రర్ మూవీ. ఈ మూవీ పేరు సబ్రిన. ఈ భయంకరమైన మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇక లేట్ చేయకుండా కథ ఏంటో తెలుసుకుందాం పదండి.

Watch Sabrina | Netflix Official Site

- Advertisement -

స్టోరీలోకి వెళ్తే..

వాన్య అనే అమ్మాయి తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమెను ఆంటీ అంకుల్ అయిన మార్యా, ఈడెన్  దత్తత తీసుకుంటారు. తర్వాత వాళ్లు ఆమెను ఎంతో ప్రేమగా చూసుకున్నప్పటికీ ఈ పిల్ల మాత్రం తల్లిని మిస్ అవుతుంది. ఆమె తల్లిని మర్చిపోయి హ్యాపీగా ఉండాలని ఈడెన్ తన ఫ్యాక్టరీలో తయారయ్యే సబ్రిన అనే ఓ పెద్ద బొమ్మను బర్త్ డే గిఫ్ట్ గా ఇస్తాడు. అయితే ఒక రోజు స్కూల్లో వాన్యా ఫ్రెండ్ చార్లీ చనిపోయిన తన అమ్మమ్మ చార్లీ అనే బోర్డు గేమ్ ద్వారా పిలిచి మాట్లాడుతాడు. దీంతో వాన్య తనకూ తన తల్లితో మాట్లాడాలని ఉంది అని చెప్తుంది. అయితే అబ్బాయి ముందుగా రూల్స్ చెప్తాడు. ఆట ఎలా ఆడాలో చెప్పాక భూమ్మీదకి పిలిచిన ఆత్మలు తిరిగి వెళ్లాలంటే కచ్చితంగా ప్రార్థన చేయాలని చెప్తాడు. అదే రోజు రాత్రి వాన్యా అతడు చెప్పిన ఆటను ఆడి తన తల్లిని పిలుస్తుంది. కానీ తల్లి కనిపించకపోవడంతో నిరాశపడుతుంది. అంతలోనే ఆమె ఆంటీ వచ్చి తనని పడుకోబెట్టి తోడుగా ఆ సబ్రీన బొమ్మను పెడుతుంది.

ఇక ఆ తర్వాత ఆ బొమ్మ వింత వింత చేష్టలు చేస్తూ వాన్యాను భయపెడుతుంది. ఇన్ని జరుగుతున్నా వాన్య తన తల్లితో మాట్లాడే ప్రయత్నం మాత్రం ఆపదు. ఓ రోజు రాత్రి దెయ్యం ఆ ఫ్యామిలీపై అటాక్ చేస్తుంది. ఈ షాకింగ్ ఘటన తర్వాత ఇద్దరు భూత వైద్యులు ఆ దయ్యాన్ని బంధిస్తారు. ఇంతకీ ఈ దయ్యం ఎవరు? వాన్య తల్లిదండ్రులు ఎలా చనిపోయారు ? చివరికి ఆ దయ్యాన్ని దాని లోకంలోకి పంపగలిగారా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు