OTT Movie : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని అత్తమామలను చంపే హీరోయిన్ ప్లాన్… కానీ ఊహించని ట్విస్ట్

OTT Movie : ఓటిటిలో అందుబాటులో ఉండే రకరకాల సినిమాలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు అతి కొద్ది కాలంలోనే ఓటీటీలో రిలీజ్ అయ్యి ఆకట్టుకుంటున్నాయి. అయితే ఓటిటిలో హారర్ బేస్డ్ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలకు బాగా క్రేజ్ ఉంది. రొమాంటిక్ థ్రిల్లర్ సినిమాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీల్లో లెక్కలేనని ఉన్నాయి. అలాగే వాటికి వ్యూస్ కూడా భారీ సంఖ్యలోనే ఉన్నాయి. ఈరోజు కూడా మనం చెప్పుకోబోయే మూవీ ఓ రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ కు సంబంధించింది. ఇందులో రొమాన్స్ తో పాటు బోల్డ్ సీన్స్, ఊహించని ట్విస్టులు కూడా ఉన్నాయి. ఒరకంగా చెప్పాలంటే సస్పెన్స్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం.

సైనా ప్లేలో స్ట్రీమింగ్…

ఓటీటీలకు డిమాండ్ పెరిగిన తరువాత భాష అనేది అసలు అడ్డే కాదని నిరూపిస్తున్నారు మూవీ లవర్స్. ఏ భాషలో రిలీజ్ అయిన సినిమా అయినా సరే తమకు నచ్చిన జానర్ అయితే కచ్చితంగా ఓసారి చూస్తున్నారు. అలాగే చాలా సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అవుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ భాష మరీ అర్థం కాకుండా ఉందనిపిస్తే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలాగో అందుబాటులో ఉంటున్నాయి. ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమా. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల కుటుంబాలు ఎలా నాశనం అవుతాయి అనే స్టోరీతో ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ వ్యూస్ పరంగా అదరగొడుతోంది. సైనా ప్లే అనే ఓటిటి ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉన్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రొమాంటిక్ మూవీ పేరు ఉడాల్.

Dhyan Sreenivasan's Horror Drama Udal Set For OTT Release On This Date - News18

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఇద్దరు భార్యాభర్తలు, ఆ దంపతులకు ఒక పిల్లాడు ఉంటారు. అయితే భర్త సిటీలో ఉద్యోగం చేస్తూ, తన తల్లిదండ్రుల దగ్గర భార్యా పిల్లలను వదిలేస్తాడు. ప్రతి నెలా డబ్బులు పంపిస్తూ వాళ్ళు సంతోషంగా బ్రతికేలా చూసుకుంటాడు. కానీ ఆ భార్య మాత్రం తప్పుదారి పడుతుంది. మంచాన పడిన అత్త, ఆమెకు సేవలు చేసే ఒక కన్ను కనిపించని మామ, కొడుకుతో కలిసి అసంతృప్తిగా బ్రతుకుతుంది. ఈ క్రమంలోనే తన క్లాస్మేట్ తో ఎఫైర్ మొదలు పెడుతుంది. ఫోన్ల దగ్గర నుంచి బెడ్ దాకా నడుస్తుంది యవ్వారం. ఆ తరువాత పీక్స్ కు వెళ్ళి, ఒకానొక సమయంలో ఇద్దరూ కలుసుకోవడానికి అత్తమామలు అడ్డుగా ఉన్నారని భావించి వాళ్ళని చంపాలనుకుంటుంది ఆ భార్య. తర్వాత ప్రియుడితో కలిసి వాళ్ళిద్దరిని చంపేయాలని ప్లాన్ చేస్తారు. కానీ ఇదంతా ఆమె మామ వింటాడు. ఆ తర్వాత వీళ్ళ ప్లాన్ మొత్తం వినేసిన మామ ఏం చేశాడు? హీరోయిన్ అనుకున్నట్టుగానే తన అత్తమామలను చంపేసిందా? చివరికి ఈ కథ ఎలాంటి మలుపు తిరిగింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ సస్పెన్స్ మూవీపై లుక్కేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు