OTT Movie: పెళ్లికి ముందు రోజే భర్తకు వచ్చిన లింక్… ఆ వీడియోలో భార్యని అలా చూసి

OTT Movie : కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయంటే నెక్స్ట్ ఏంటి అనే ఆతృతను పెంచేస్తాయి. థ్రిల్లింగ్ కథతో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి ఫీల్ కావాలి అనుకునే సస్పెన్స్ మూవీ లవర్స్ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

యాపిల్ టీవీలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు టెల్ నో వన్. ఇదొక ఫ్రెంచ్ మూవీ. ప్రస్తుతం యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇంగ్లీషులో కూడా అవైలబుల్ గా ఉంది. సినిమాలో చాలా పాత్రలు ఉన్నప్పటికీ డైరెక్టర్ గిల్లియం క్యానేట్ అన్ని పాత్రలకు సరైన ప్రాధాన్యతను ఇచ్చారు. పైగా ఎక్కడా ఈ క్యారెక్టర్ అవసరమా అనే డౌట్ రాకుండా సినిమాను తెరకెక్కించారు. 2006లో రూపొందిన ఈ ఫ్రెంచ్ మూవీ మస్ట్ వాచ్ థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. పైగా ఇదొక అవార్డు విన్నింగ్ మూవీ కూడా. ఏకంగా నాలుగు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇన్ని అవార్డులను దక్కించుకున్న మూవీని సస్పెన్స్ మూవీ లవర్స్ అసలు మిస్ అవ్వద్దు.

Tell No One (2006) | Rotten Tomatoes

- Advertisement -

కథలోకి వెళ్తే…

మార్గోట్, అలెగ్జాండర్ బెక్ ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ పెళ్ళి రోజున సెలబ్రేట్ చేసుకోవడానికి రిసార్ట్ కు వెళ్తారు. అక్కడికి వెళ్లి క్రమంలో వీళ్ళపై అటాక్ జరుగుతుంది. తెలియని వ్యక్తులు చేసిన ఆ దాడిలో హీరోయిన్ మార్గోట్ చనిపోతుంది. కానీ అలెక్స్ మాత్రం గాయాలతో కోమాలోకి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ ఎనిమిదేళ్ల తర్వాత ఉంటుంది. చిల్డ్రన్ డాక్టర్ గా పని చేసే అలెక్స్ తన చనిపోయిన భార్య మార్గోట్ ను మర్చిపోలేక బాధపడుతూ ఉంటాడు. పైగా పెళ్లి కూడా చేసుకోడు. అలా తన పెళ్లి రోజుకు ఒకరోజు ముందే అలెక్స్ కు ఒక లింక్ ఉన్న మెయిల్ వస్తుంది. అది కూడా స్పెసిఫిక్ గా టైం మెన్షన్ చేసి, అప్పుడే ఓపెన్ చేయమంటారు. ఇదే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ వాళ్ళ ఫామ్ హౌస్ లో రెండు శవాలు దొరికాయని, విచారించాలని చెప్తాడు. దానికి అలెక్స్ ఒప్పుకుంటాడు. ఆ తర్వాత లింక్ ఓపెన్ చేసి చూడగా అందులో ఒక సీసీటీవీ లైవ్ ఫుటేజ్ ఉంటుంది. మార్గోట్ ఆ వీడియోలో కనిపిస్తుంది. దీంతో అసలు విషయం ఏంటో చెప్పకుండా మార్గోట్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తాడు.

ఎందుకంటే ఆమె తండ్రి మాత్రమే అది తన బిడ్డ శవం అని గుర్తుపట్టి అంత్యక్రియలు చేస్తాడు. కానీ అలెక్స్ ఫామ్ హౌస్ లో మరో రెండు శవాలు దొరకడంతో ఈ ముగ్గురు హత్య చేసింది ఆయనేనని పోలీసులు అనుమానిస్తారు. దానికి తగ్గట్టుగానే సాక్ష్యాధారాలు కూడా పెరుగుతూ దానికి తగ్గట్టుగానే సాక్ష్యాధారాలు కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ ఓ చిన్న ట్విస్ట్ తో పోలీసులు అసలు మార్గోట్ చనిపోలేదనే విషయాన్ని కనిపెడతారు. మరి మార్గోట్ ఎందుకు చనిపోయినట్టుగా నటిస్తోంది ? ఆమెపై దాడి చేయించింది ఎవరు ? చివరికి అలెక్స్ మార్గోట్ ను కలిశాడా ? అని ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే. ఇక పలుచోట్ల బో*ల్డ్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి ఈ మూవీని సింగిల్ గా చూస్తే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు