OTT Movie : అమ్మాయి అనుకుని ఆడ రోబోతో రొమాన్స్… తెలిశాక ఉంటది మామా ట్విస్టూ…

OTT Movie : ఓటిటిలో వందల కొలది లవ్ స్టోరీలు అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో లవ్ స్టోరీ విత్ కామెడీ కాంబినేషన్ సినిమాలు దొరకాలంటే చాలా కష్టం. ఈ అరుదైన జానర్ సినిమాల కోసమే సెర్చ్ చేస్తున్న వాళ్ల కోసం ఈ మూవీ సజెషన్. కావలసినంత కామెడీ తో పాటు లవ్, రొమాంటిక్, ఎమోషన్ వంటి అంశాలు కూడా ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయి. మరి ఇంతకీ ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హీరో అమ్మాయి అనుకొని ఏకంగా ఒక ఆడ రోబోని ప్రేమిస్తాడు. అది కూడా ఏదో టైంపాస్ లాగా కాకుండా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి, పెళ్లి దాకా వెళ్తాడు. తీరా అక్కడే మొదలవుతుంది అసలు ట్విస్ట్. ఈ మూవీ పేరు తేరి బాతోమే ఏసా ఉల్జా జియా. ఇది హిందీ మూవీనే కానీ ఈ అరుదైన కాంబినేషన్ సినిమా చూడాలంటే కచ్చితంగా ఈ మూవీని చూడాల్సిందే. ఒకవేళ భాష అడ్డుగా అనిపిస్తే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఎలాగో అందుబాటులో ఉంటాయి.

Teri Baaton Mein Aisa Uljha Jiya' Crosses $10 Million In A Week

- Advertisement -

కథలోకి వెళితే…

రోబో అనగానే మనకు వెంటనే రజినీకాంత్ హీరోగా నటించిన విజువల్ వండర్ సినిమాలే గుర్తొస్తాయి. కానీ ఈ డైరెక్టర్ మాత్రం ప్రేక్షకులకు ఉన్న ఆ ఆలోచనను మార్చడానికి ట్రై చేశాడు. రీసెంట్ గా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటిటిలో కూడా అదే రేంజ్ లో దూసుకెళ్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. అమ్మాయి కూడా అతన్ని బాగా ఇష్టపడుతుంది. ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ చేసి ఆ తర్వాత ఒకరికి ఒకరు బాగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇంట్లో వాళ్ళ పర్మిషన్ కోసం తాను ఇష్టపడిన అమ్మాయిని తల్లిదండ్రులకు పరిచయం చేస్తాడు హీరో. అయితే సాధారణ అమ్మాయిల కంటే ఈ అమ్మాయి విచిత్రంగా ఉండడంతో వాళ్లకి డౌట్ వస్తుంది. హీరోకు కూడా అలాగే అనిపించినప్పటికీ ఆమె అమెరికా నుంచి వచ్చింది కాబట్టి ఇలా బిహేవ్ చేస్తోంది అని కవర్ చేస్తాడు. అయితే ఓ రోజు ఈ రోబోని తయారు చేసిన హీరో దగ్గరి వాళ్ల ద్వారా అది మనిషి కాదని తెలుస్తుంది. తర్వాత హీరో ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడు? రోబో అయిన ఆ అమ్మాయి హీరోకి విషయం తెలుశాక ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది ? రోబోతో హీరో ప్రేమాయణాన్ని అతని కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారా ? వంటి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని వీక్షించాల్సిందే. ఇక సినిమాకు ఉన్న మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే హీరో హీరోయిన్. ఇందులో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితులైన షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు