OTT Movie : మనుషుల్ని చంపి మనుషులకే వంట… భయంతో చెమటలు పట్టాల్సిందే

OTT Movie : సినిమాలలో సైకో థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఇందులో లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ ను మెయింటైన్ చేస్తూ ప్రేక్షకులను తల తిప్పుకోనివ్వకుండా చేస్తారు మేకర్స్. ముఖ్యంగా కొన్ని సైకో కిల్లర్ సినిమాలు కొత్త కొత్త కథలతో డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు మన మూవీ సజెషన్ కూడా అలాంటి సైకో కిల్లర్ మూవీనే. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

సైకో కిల్లర్ అనగానే ఓవరాల్ గా చంపడం, చివరి వరకు ఆ కిల్లర్ దొరక్కపోవడం అనే అంశాలపైనే స్టోరీ నడుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఇలాగే ఉంటుంది. కానీ ఇది కాస్త వింతగా ఉంటుంది. గతంలో తనకు జరిగిన విషాదానికి పగ తీర్చుకోవడానికి సైకో కిల్లర్ గా మారతాడు ఇందులో. పైగా మనుషుల్ని చంపి మనుషులకే వండి తినిపిస్తాడు. ఊహించడానికి భయంకరంగా ఉన్న ఈ మూవీ పేరు థాంక్స్ గివింగ్. అయితే సైకో కిల్లర్ మూవీ కాబట్టి ఇందులో చాలావరకు డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లలతో ఈ మూవీని అస్సలు చూడొద్దు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

Thanksgiving Movie Review | Horror

- Advertisement -

కథ ఏంటంటే…

ప్రతి ఏడాది ఓ టౌన్ లో ఉన్న ఓ మార్ట్ లో థాంక్స్ గివింగ్ అనే ఈవెంట్ నిర్వహిస్తారు. అందులో జరిగే సేల్ లో కావాల్సిన వస్తువులను తక్కువ ధరకే కొనుక్కోవాలని ఆలోచనతో టౌన్ లో ఉండే ప్రజలంతా అక్కడకు వెళ్తారు. కానీ ఒకేసారి చాలామంది ఆ ప్లేస్ కి రావడంతో మార్ట్ వాళ్ళు జనాలను కంట్రోల్ చేయలేకపోతారు. దీంతో తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు విడుస్తారు. ఇంకేముంది ఈ విషాద సంఘటనతో ఆ మార్ట్ పేరు మార్మోగుతుంది. అయితే అప్పట్నుంచి ఆ టౌన్ లో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. ముందుగా మార్ట్ లో పనిచేసే వెయిటర్ చనిపోతుంది. మాస్క్ వేసుకున్న వ్యక్తి ఆమెను చంపేసాడని గుర్తించినప్పటికీ పోలీసులు అతన్ని పట్టుకోలేక పోతారు. ఆ తర్వాత ఈ సైకో కిల్లర్ ఆ మార్ట్ ఓనర్ జెస్సికాను టార్గెట్ చేస్తాడు. సోషల్ మీడియాలో ఆమెకు భయంకరమైన పోస్టులు పెడుతూ అంతకంటే ముందే మరి కొంతమందిని కిడ్నాప్ చేసి మరీ చంపేస్తాడు. అందులో భాగంగా జెస్సికా కుటుంబాన్ని టార్గెట్ చేసి అందరికీ తెలిసేలా నెమ్మదిగా ఒక్కొక్కరిని చంపేస్తాడు. ఆమె తల్లినైతే చంపడమే కాకుండా ముక్కలు ముక్కలుగా నరికి వంట చేస్తాడు. దాన్ని ఆ తర్వాత తాను కిడ్నాప్ చేసిన వాళ్ళకి వడ్డిస్తాడు. మరి ఈ సైకో కిల్లర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఆ మార్ట్ ఓనర్ కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేశాడు? చివరికి ఈ సైకో కిల్లర్ దొరికాడా లేదా అనే విషయాలు తెలియాలంటే థాంక్స్ గివింగ్ అనే మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు