OTT Movie : ఏజ్ పెరిగే కొద్దీ యంగ్ అయ్యే హీరో… బెస్ట్ ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : సాధారణంగా మనిషి పుట్టినప్పటి నుంచి ఏజ్ పెరగడం మొదలవుతుంది. పుట్టినరోజు నుంచి మొదలుకొని నెలలు సంవత్సరాలను లెక్కబెడతాము. దానికి తగ్గట్టుగానే వయసు పెరుగుతూ చిన్నపిల్లల నుంచి పెరిగి ముసలి వాళ్లు అవుతూ వస్తారు. కానీ ఇప్పుడు మనం చెప్పక పోయే ఫాంటసీ థ్రిల్లర్ మాత్రం దీనికి డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఏజ్ రివర్స్ లో నడుస్తుంది. మరి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే అరుదైన ఈ ఫాంటసీ థ్రిల్లర్ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది? స్టోరీ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పటి వరకు ఓటీటీలో ఎన్నో ఫాంటసీ థ్రిల్లర్ సినిమాలను చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ మాత్రం ఖచ్చితంగా అన్నింటి కంటే చాలా డిఫరెంట్ అని చెప్పొచ్చు. సాధారణ థ్రిల్లర్ సినిమాలను చూసి చూసి బోర్ కొట్టిన వాళ్లకు ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

The Curious Case of Benjamin Button | F. Scott Fitzgerald, David Fincher,  Robin Swicord Eric

- Advertisement -

కథ ఏంటంటే…

సినిమా మొదట్లోనే ఓ ముసలావిడ చావు బతుకుల్లో హాస్పిటల్ బెడ్ పై పడుకొని ఉంటుంది. తల్లిని ఆ పరిస్థితిలో చూసి కూతురు తట్టుకోలేక పోతుంది. ఆమె బాధను పోగొట్టడానికి తల్లి బెంజమిన్ అనే ఒక స్టోరీని చెప్పడం మొదలుపెడుతుంది. ఈ స్టోరీలో బెంజమిన్ అనే వ్యక్తి ముసలివాడిగా పుడతాడు. 70 ఏళ్ల ముసలివాడే అయినప్పటికీ సైజులో మాత్రం చిన్న పిల్లాడిలాగే ఉంటాడు. అయితే అతను పుట్టగానే తల్లి చనిపోతుంది. దీంతో నర్సింగ్ హోమ్ లో పెరుగుతాడు. విచిత్రంగా అతను కాలం గడిచే కొద్దీ ముసలి వయసు నుంచి వయసు తగ్గి యంగ్ గా మారతాడు. అంటే ముసలివాడిగా పుట్టి రానురాను చిన్న వ్యక్తిగా మారడం అనేది అతనికి ఉన్న అత్యంత అరుదైన వ్యాధి అన్నమాట. అందరిలా కాకుండా విచిత్రంగా ముసలి ఏజ్ లో పుట్టడం వల్ల బెంజమిన్ కు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. సపోర్ట్ చేసే వాళ్ళు సరిగ్గా లేక చాలా అవమానాలు ఎదుర్కోవడంతో పాటు కష్టాలు కూడా తప్పవు.

అయితే ఒకానొక సమయంలో ఏడేళ్ల డైలీ అనే అమ్మాయిని కలుస్తాడు. ఇక యంగ్ ఏజ్ లోకి చేరుకున్నాక పని చేయడం మొదలు పెడతాడు. కొన్నేళ్ల తర్వాత మళ్లీ డైజీ, బెంజిమెన్ కలుసుకోవడం, పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఇద్దరికీ ఒక పాప కూడా పుడుతుంది. కానీ రోజురోజుకీ బెంజమిన్ వయసు తగ్గిపోవడం అనేదే సమస్యగా మారుతుంది. ఆ సమస్యను ఫేస్ చేయలేక బెంజమిన్ ఇంట్లో నుంచి పారిపోతాడు. ఆ తర్వాత స్టోరీకి ఎండ్ కార్డ్ ఎలా పడింది? అనే విషయం తెలియాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బటన్ అని సినిమాను చూడాల్సిందే. అయితే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ లో అందుబాటులో ఉంది. అలాగే యూట్యూబ్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు