OTT Movie : గిఫ్ట్స్ అంటే ఇష్టమా? ఈ మూవీ చూస్తే జన్మలో గిఫ్ట్ ముట్టుకోరు

OTT Movie : గిఫ్ట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? ప్రతి ఒక్కరికి సర్ప్రైజ్ చేసే అందమైన గిఫ్ట్స్ తో పాటే, అవి ఇచ్చేవారన్నా ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందుకే రిలేషన్షిప్ లో ఉన్నవాళ్లు అప్పుడప్పుడు ఒకరినొకరు గిఫ్ట్ లతో సర్ప్రైజ్ చేసుకోవాలని చెబుతుంటారు. అప్పుడే వాళ్ళ బంధం మరింత స్ట్రాంగ్ అవుతుంది. కానీ అలా గిఫ్ట్స్ అంటే ఇష్టపడేవారు ఈరోజు మూవీ సజెషన్లో మనం చెప్పుకోబోయే మూవీ గురించి తెలుసుకున్నాక వాటిని తీసుకోవడానికి కూడా వణికి పోతారు. మరి ఆ మూవీ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రిమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది. అలాగే ఇదొక హాలీవుడ్ మూవీ. 2015లో రిలీజ్ అయిన ఈ మూవీ మొత్తం ఒక పెళ్లయిన జంటతో పాటు వారి ఫ్రెండ్ చుట్టూ తిరుగుతుంది. మూవీ పేరు ది గిఫ్ట్. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.46 Facts about the movie The Gift - Facts.net

కథలోకి వెళ్తే…

సైమన్, రాబిన్ ఇద్దరు కొత్తగా పెళ్లయిన జంట. ఉద్యోగం కోసం చికాగో నుంచి లాస్ ఏంజిల్స్ లోని కొత్త ఇంటికి మారతారు. ఆ తర్వాత సైమన్ క్లాస్మేట్ గోర్డెన్ ఈ జంటకి కనిపిస్తాడు. ఇక అదే రోజు గోర్డెన్ రాత్రి వైన్ బాటిల్, వెల్కమ్ నోట్ పెట్టి ఉండడం వాళ్ళ ఇంటి ముందు కనిపిస్తుంది. రాబిన్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ఇంటి నుంచే పని చేసుకుంటూ ఉంటుంది. గోల్డెన్ రాబిన్ కి మరిన్ని గిఫ్ట్స్ తీసుకొస్తాడు. దీంతో ఆమె అతన్ని మర్యాద కోసం ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అయితే ఓ గదిలో బొమ్మలు ఉండడం చూసి మీకు పిల్లలు లేరా అని అడుగుతాడు. అయితే చికాగోలో ఉన్నప్పుడు మిస్ క్యారేజ్ అయ్యిందని రాబిన్ చెప్తుంది. ఆ తర్వాత తమ ఇంట్లోనే డిన్నర్ చేయాలని అతన్ని అడుగుతుంది. అతను కూడా ఒప్పుకుంటాడు.

- Advertisement -

అతని ప్రవర్తన తేడాగా ఉండడంతో సైమన్ ఇంకోసారి అతను మన ఇంటికి రావద్దని చెప్తాడు. ఆ తర్వాత రోజు కూడా ఎప్పటిలాగే చేప పిల్లలు ఉండే తొట్టితో పాటు ఓ లెటర్ గిఫ్ట్ గా ఉంటుంది. తమ ఇంటికి డిన్నర్ కు రావాలని అందులో ఇన్విటేషన్ పంపుతాడు గోర్డెన్. ఆ తర్వాత ఇద్దరు కలిసి డిన్నర్ కి వెళ్తారు. అయితే గోర్డెన్ లేని టైమ్ లో అతను రాబిన్ ను ట్రాప్ చేయడానికి ట్రై చేస్తున్నాడేమో అని అనుమానంతో సైమన్ అతనికి తెలియకుండానే అతని ఇల్లంతా వెతుకుతాడు. అంతా అయ్యాక సైమన్ ఇక నువ్వు గిఫ్టులు పంపొద్దు మా ఇంటికి రావద్దు అని సీరియస్ గా చెప్తాడు. తీరా ఇంటికి వెళ్లి చూస్తే తమ కుక్క పిల్ల కనిపించదు. అలాగే చేప పిల్లలు కూడా చనిపోయి ఉంటాయి. ఆ తర్వాత సైమన్ ఇంట్లో ఏం జరిగింది? ఈ జంట ఆ పరిణామాలను ఎలా ఎదుర్కొన్నారు? గోర్డెన్ అసలు ఎలాంటి వాడు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీ ని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు