OTT Movie : హోటల్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టించే హార్రర్ మూవీ… 3 రోజులు టైం ఇచ్చే దెయ్యం

OTT Movie : హారర్ సినిమాలు అనగానే కాస్త అలర్ట్ అవుతూ ఉంటాము. భయమేసినా సరే చూడడానికి మాత్రం వెనకాడము. అలాంటి వారి కోసమే వెన్నులో వెనుక పుట్టించే హర్రర్ మూవీ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాను ఇప్పటి దాకా మీరు చూసి ఉండరు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ మూవీ ఏంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న ఈ హర్రర్ మూవీలో ట్విస్టులు తప్పకుండా ప్రేక్షకులను థ్రిల్ ఫీల్ అయ్యేలా చేస్తాయి. సినిమా చివరి వరకు ఏం జరుగుతుందో అనే ఆసక్తి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. హర్రర్ సినిమాలు అంటే కచ్చితంగా కొన్ని భయంకరమైన సీన్స్ ఉంటాయి. ఇందులో కూడా అలాగే, ఇంకా చెప్పుకోవాలంటే పెద్ద జుట్టుతో తెల్లగా ఉండే దయ్యం కనిపిస్తుంది. కానీ కథ మాత్రం డిఫరెంట్ గా ఉండడంతో ఈ మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ది హాంటెడ్ హోటల్. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Watch The Haunted Hotel | Netflix

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఈ హారర్ మూవీ స్టోరీ 1981లో స్టార్ట్ అవుతుంది. ఓ సిటీలో ఉన్న ఫేమస్ హోటల్ లో పని మనిషి పని చేయడానికి రెడీ అవుతుంది. అయితే ఓనర్ రెండు ఫ్లోర్లు మాత్రమే క్లీన్ చేయమని, మూడో ఫ్లోర్ కి వెళ్లొద్దు అని హెచ్చరిస్తుంది. అయితే ఆమెకు మూడో ఫ్లోర్ నుంచి ఏవో శబ్దాలు రావడంతో చూద్దామని పైకి వెళ్లి చెక్ చేస్తుంది. ఇంకేముంది అద్దం ముందు కూర్చున్న దెయ్యం ఆమెతో మూడున్నర రోజులు అని చెప్తుంది. దీంతో ఆ మూడున్నర రోజుల పాటు ఆమె అనేక భయంకరమైన అనుభవాలను ఎదుర్కొని, చివరికి దారుణంగా చనిపోతుంది. కొన్నాళ్ల తర్వాత రైనా, ఫే అనే ఇద్దరు అక్క చెల్లెలు అదే హోటల్ కి వెళ్తారు.

తన తండ్రి చనిపోయే ముందు ఈ హోటల్ మనదే అని చెప్పడంతో దాని గురించి తెలుసుకోవడానికి వెళ్తారు. అయితే వాళ్ల తాతయ్య అమ్మమ్మ కలిసి ఆ హోటల్ ను నడుపుతూ ఉంటారు. ఇక అక్కడ పరిస్థితులు తెలియకుండా వచ్చిన అక్క చెల్లెలు ఇద్దరినీ మూడో ఫ్లోర్ లోకి వెళ్ళొద్దని హెచ్చరిస్తుంది వాళ్ల అమ్మమ్మ. సేమ్ ఇంతకు ముందు పని మనిషికి జరిగినట్టుగానే ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లకు కూడా మూడు రోజులు టైం ఇస్తుంది దెయ్యం. అయితే అదే సమయంలో స్కూల్లో జాయిన్ కావడానికి వెళ్లిన రైనాకు అక్కడే తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఆర్డో కనిపిస్తాడు. అతనితో ఈ విషయం చెప్పగా, హోటల్లో దారుణంగా కొంతమంది దారుణంగా చనిపోయారు అనే విషయాన్ని ఆ అక్క చెల్లెలకు చెప్తాడు. దీంతో వాళ్ళిద్దరూ వెళ్లి తమ అమ్మమ్మ తాతయ్య దగ్గర విషయం ఏంటని నిలదీస్తారు? మరి అసలు ఆ మూడో ఫ్లోర్లో దయ్యం ఎందుకు ఉంది? ఎందుకు మూడున్నర రోజుల టైం ఇచ్చి చంపుతోంది? చివరికి అక్క చెల్లెల పరిస్థితి ఏమైంది? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు