OTT Movie : చిన్న కన్నం బయట పెట్టే అమ్మమ్మ తాతయ్యల భయంకరమైన సీక్రెట్… మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులే ట్విస్టులు

OTT Movie :సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు అనగానే చెవి కోసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇక ఈ సస్పెన్స్ కి హర్రర్ తోడైతే ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడం కాదు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్టులతో కొనసాగే మూవీ గురించి ఈరోజు మూవీ సజెషన్లో తెలుసుకుందాం. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ఓ చిన్న కన్నం అమ్మమ్మ తాతయ్యల సీక్రెట్ ను బయట పెడుతుంది. అక్క తమ్ముడు వాళ్ళ తల్లి కోమాలోకి వెళ్లడంతో వేరే దారి లేక అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు. కానీ అక్కడ ఉండే ఒక కన్నం వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఈ మూవీ పేరు ది హోల్ ట్రూత్. 2021లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Watch The Whole Truth | Netflix Official Site

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

షిమ్, పుత్ అనే ఇద్దరు అక్కాతమ్ముళ్లు ఉంటారు. వాళ్ల తల్లి మాయి సింగిల్ పేరెంట్. ముగ్గురు సరదాగా ఫ్యామిలీ లైఫ్ ను గడుపుతారు. అయితే సడన్ గా ఓ రోజు మాయి తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పి పిల్లలకు పార్టీ ఇస్తానని చెప్తుంది. ఆ తర్వాత రోజే సాయంత్రం తమ్ముడు పుత్ తన అక్క ఇంటికి వచ్చేసరికి ఫ్రెండ్ తో కలిసి వీడియో గేమ్స్ ఆడుతాడు. అయితే పుత్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని ఫాలో అయ్యి బట్టలు మార్చుకోవడం చూస్తూ ఉంటాడు. అది గమనించిన వెంటనే గట్టిగా డోర్ వేస్తుంది. దీంతో కాలికి గాయమై కోపంతో అతను మీ అక్క నాతో డేటింగ్ చేయకపోతే ఇప్పుడు తీసిన వీడియో లీక్ చేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

మరోవైపు మాయి ఆఫీస్ నుంచి వస్తున్న క్రమంలో భారీ వర్షం కారణంగా ఆమెకు యాక్సిడెంట్ అవుతుంది. కోమాలోకి వెళ్ళిపోతుంది. ఈ నేపథ్యంలోనే అక్కాతమ్ముళ్లు ఇద్దరిని తీసుకెళ్లడానికి అమ్మమ్మ తాతయ్య వస్తారు.. అయితే ఆ ఇంట్లో వీళ్ళిద్దరికీ వింత వింత శబ్దాలు, భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి. ఆ తర్వాత అక్కడ కన్నం కనిపిస్తుంది. అందులో నుంచి చూస్తే అవతల వైపు ఓ భయంకరమైన సీన్ కనిపిస్తుంది. దాని గురించి అమ్మమ్మ తాతయ్యలను అడిగితే అక్కడ ఏమి లేదని చెప్తారు. విషయం ఏమిటంటే ఇద్దరు అక్కా తమ్ముళ్ళకి మాత్రమే ఆ కన్నం కనిపిస్తుంది. ఇక హాస్పిటల్ లో ఉన్న మాయి కోమాలో నుంచి బయటకు వచ్చి తన పిల్లల గురించి అడిగితే అక్కడున్న డాక్టర్స్ వాళ్ళు అమ్మమ్మ తాతయ్య ఇంటికి వెళ్లారని చెప్తారు. దీంతో ఆమె అక్కడికి వెళ్లడం డేంజర్ అంటూ భయపడుతుంది. సొంత అమ్మమ్మ తాతయ్యల ఇంట్లో ఉండడం డేంజర్ ఎలా అవుతుంది? అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఆ కన్నం సీక్రెట్ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని ఓసారి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు