OTT Movie : పడక సుఖం కోసం మెయిడ్ ని వాడుకుని… పని మనిషి పేరు వింటేనే పార్ట్స్ అన్నీ ప్యాక్ అయ్యే మూవీ

OTT Movie : ఎన్నో సినిమా జానర్లు ఉన్నప్పటికీ అందులో హారర్ మూవీ జానర్ సపరేట్ అని చెప్పాలి. అప్పుడప్పుడూ గుండె జారేలా చేస్తూ, మంచి థ్రిల్లింగ్ ఫీలింగ్ ఇచ్చే సూపర్ నేచురల్ హారర్ ఫిలిం అంటే వెన్నులో వణుకు పుట్టించే విధంగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎంత భయమేసినా సరే ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడే వారి సంఖ్య భారీగానే ఉంటుంది. ఈరోజు అలాంటి మూవీ గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఆ మూవీ పేరేంటి? అనే విషయంలోకి వెళ్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

సినిమా ఎండింగ్ వరకూ ఊహించని ట్విస్టులతో, చెమటలు పట్టించే విజువల్స్ తో, గ్రిప్పింగ్ కథ కథనంతో సాగే హారర్ మూవీ ఇది. 2020లో విడుదలైన సూపర్ నేచురల్ థిల్లర్ మూవీ ది మెయిడ్. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూశాక పని మనిషి పేరు వింటేనే పార్ట్స్ అన్ని ప్యాక్ అవడం ఖాయం.

కథ ఏంటంటే…

ఉమా, నిరాజ్ ఇద్దరూ భార్య భర్తలు. వారికి నిద్ అనే కూతురు ఉంటుంది. అలాగే ఆ ఇంట్లో ఓ పని మనిషి పని చేస్తుంది. అయితే కొన్ని హార్రర్ సంఘటనలు జరగడంతో ఆ పని మనిషి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీంతో ఆమె ప్లేస్ ని జాయ్ అనే కొత్త పనిమనిషి రీప్లేస్ చేస్తుంది. రాగానే ఇంట్లో అందరినీ పరిచయం చేసుకున్న తర్వాత జాయ్ ఇక్కడ పని చేయకుండా ఎందుకు అందరూ పారిపోతున్నారు అని డ్రైవర్ ని అడుగుతుంది. అతను ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఈ అమ్మాయికి భయంకరమైన ఆకారం కనబడడం, లైట్లు ఆర్పగానే కొన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంది. అయినప్పటికీ జాయ్ పట్టించుకోకుండా అక్కడే పని చేస్తుంది.

- Advertisement -

Film Review] The Maid (2021) — Ghouls Magazine

అయితే ఓ రోజు ఆ ఇంట్లో ఉన్న ఫోటోను గమనిస్తుంది పనిమనిషి. తర్వాత అందులో ఉన్న ఓ అమ్మాయి దెయ్యంలా వచ్చి భయపెడుతుందని కనిపెడుతుంది. దీంతో ఆ అమ్మాయి ఎవరు? ఏం జరిగింది ? అని అక్కడ ఉన్న వారిని ప్రశ్నిస్తే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఇంతకు ముందు పని మనిషిగా చేసిందని, ఈ భార్యాభర్తలు ఇద్దరికీ శారీరకంగా దగ్గర అయిందని, ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయిందని, బిడ్డ పుట్టాక ఎందుకో చనిపోయిందని చెప్తారు. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు ప్లాయ్. ఆమెకు పుట్టిన బిడ్డని ఈ దంపతులు తమ బిడ్డ అని అందరికీ పరిచయం చేస్తారు. ఆ పాపని ఇప్పుడున్న నిడ్ అని తెలుసుకుంటుంది జాయ్. ఇంతకీ ఫ్లాయ్ ఎలా చనిపోయింది? జాయ్ ఇన్ని హర్రర్ సంఘటనలు జరుగుతున్నా అక్కడే ఎందుకు ఉంటుంది? ప్లాయ్ తో జాయ్ రిలేషన్ ఏంటి? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ది మెయిడ్ మూవీని నెట్ ఫ్లిక్స్ లో చూసి తెలుసుకోవాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు