OTT Movie : కొత్త ప్లేస్ లో, కొత్త వంటలు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఈ మూవీని చూస్తే ఆ ఆలోచనకే సుస్సు పడుద్ది

OTT Movie : చాలామందికి ప్రపంచాన్ని చుట్టేయాలనే కోరిక ఉంటుంది. కానీ బరువులు, బాధ్యతలు అంటూ ఇంటికే పరిమితమైపోతారు. కానీ ఇప్పుడున్న యూత్ మాత్రం ముందు తమ గోల్స్ నెరవేర్చుకున్నాకే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అవసరమైతే అలా ప్రపంచాన్ని చుట్టి రావడానికి పెళ్లిని కూడా పక్కన పెడుతున్నారు. మరి కొంతమంది ఫ్యామిలీతో వెళ్తే, ఇంకొంతమంది లవర్స్ తో కలిసి ట్రిప్స్ వేస్తున్నారు. ఇలా చూడని ప్లేస్ ను చూడడం, కొత్త కొత్త ఫుడ్ ను ఎంజాయ్ చేయడం వంటివి ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. ఈ సినిమాని చూశాక జీవితంలో మరోసారి తెలియని ప్లేస్ కి అతిధులుగా వెళ్లాలన్నా, కొత్త ఫుడ్ ను టేస్ట్ చేయాలన్నా వణికిపోతారు. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? సినిమా స్టోరీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

హాట్ స్టార్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నోరూరించే ఫుడ్ కోసం పరితపించే వాళ్ళు తప్పకుండా ఈ మూవీని చూడాల్సిందే. ఓ వింత ఐలాండ్లో, చెఫ్ తో పాటు వాళ్ళ టీం వచ్చిన అతిథులకు ఎలాంటి మర్యాదలు చేశారు? ఎలాంటి ఫుడ్ తినిపించారు? అనే అంశాలతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇక ఈ మూవీ పేరు ది మెనూ. ఇంకా చూడకపోతే వెంటనే ఓ లుక్కెయ్యండి.

Movie of the week : The Menu ! - Culturius

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో బాగా డబ్బున్న వాళ్ళు కొంతమంది ప్రపంచంలోనే పాపులర్ అయిన చెఫ్ వంట తినాలని భావిస్తారు. దానికోసం ప్రత్యేకంగా టికెట్స్ బుక్ చేసుకుని మరీ షిప్ లో ఓ అందమైన ఐలాండ్ కి వెళ్తారు. అయితే హీరో తన గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని అక్కడికి వెళ్తాడు. మొత్తానికి చాలామంది రిచ్ పీపుల్ అద్భుతమైన విందుకోసం కలలు కంటూ ఆ ఐల్యాండ్ కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే అందరికీ వావ్ అనిపించే ఫీలింగ్ కలుగుతుంది. ముందుగా ఒక ఆవిడ వచ్చి వీళ్ళని ఆహ్వానిస్తుంది. ఇక చెఫ్ ఈ రాత్రి మీ జీవితంలో మర్చిపోలేని రాత్రి అవుతుంది అంటూ వాళ్ల కోసం వంట మొదలు పెడతారు. అయితే ఆ చెఫ్ ఏం చెప్తే అదే చేస్తారు అక్కడున్న టీం అంతా. జస్ట్ చప్పట్లు కొడితే చాలు రోబోల్లా పని చేసుకుంటూ వెళ్తారు. మొత్తానికి అతిధులను బాగానే రిసీవ్ చేసుకున్నా, వాళ్ళు వింతగా ప్రవర్తిస్తారు. హీరోయిన్ కి అప్పటికే తేడా కొడుతుంది. అక్కడి నుంచి తప్పించుకుందామని ప్రయత్నించినా వాళ్ళు వెళ్ళనివ్వరు. ఒక్కో రౌండ్ కి ఒక్కొక్కరి ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇంతకీ చెఫ్ ఇలా ఎందుకు అందరిని చంపుతున్నాడు? మరి ఈ భయంకరమైన పరిస్థితి నుంచి హీరో హీరోయిన్ తప్పించుకున్నారా? మంచి చెఫ్ చేసే వంటలు తినాలనే కోరికతో తమ చావును తామే కొని తెచ్చుకున్న వాళ్ళలో ఎంతమంది బతికి బయటపడగలిగారు? అనే విషయాలు తెలియాలంటే ది మెనూ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు