OTT Movie : అచ్చ తెలుగు హార్రర్ వెబ్ సిరీస్… ఏ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?

OTT Movie : అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్ని ప్లస్ హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్, ఆహా వంటి ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత రీజనల్ కంటెంట్ తో పాటు ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమాలు, సిరీస్ లకు కూడా మంచి ఆదరణ దక్కుతోంది. కానీ ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు ఇలా తెలుగులోకి కూడా డబ్ అవ్వడమే తెలుగు సినిమాలకు పెద్ద ప్రాబ్లంగా మారింది. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా ఆడుతుంది అనేది నిజమే. కానీ ఒకేసారి ఓటీటీలో అన్నీ భాషల సినిమాలు రిలీజ్ అయితే పోటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కువగా కొరియన్, మలయాళ సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ప్రతి వీకెండ్ చాలా వరకు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటిలో కొన్ని సినిమాలకు మాత్రమే మంచి ఆదరణ దక్కుతోంది. అందుకే మేకర్స్ తో పాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉంటాయి. ఈ పోటీ కారణంగా చాలా వరకు తెలుగులో రిలీజ్ అయ్యే చిన్న సినిమాలు వెబ్ సిరీస్లు ఓటిటి ప్రపంచంలో నిలదొక్కుకోవడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక మంచి అచ్చ తెలుగు థ్రిల్లర్ మూవీ గురించి చెప్పుకుందాం.

హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ థ్రిల్లర్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా పేరు ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. ఈ సిరీస్ లో దివి, నందు, అశుతోష్ రాణా, అజయ్, తేజస్వి తదితరులు కీలకపాత్రలు పోషించారు. అలాగే కీలకపత్రాలు పోషిస్తున్న సీనియర్ నటి సుధా, భాను చందర్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా సీరియస్ గా కన్పించబోతున్నారు. ఈ హారర్ వెన్ సిరీస్ త్వరలోనే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ను తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా స్ట్రిమింగ్ చేయబోతున్నారు. అయితే ఈ సిరీస్ కు సంబంధించిన టైటిల్ ను తప్ప ఇప్పటిదాకా ఇంకే ఇన్ఫర్మేషన్ ను పంచుకోలేదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్.

Disney+ Hotstar Telugu | A Tour or a Trap? Prepare for the ultimate game of life and lies ⚠️ #TheMysteryofMokshaIsland Coming Soon on #DisneyPlusHotstar | Instagram

- Advertisement -

స్టోరీ ఇదే?

టైటిల్ ను రివీల్ చేసిన పోస్టర్ ను బట్టి చూస్తే ఈ వెబ్ సిరీస్ స్టోరీ లైన్ గురించి అర్థమవుతుంది. ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ అనే ఈ సిరీస్ టైటిల్ ప్రకారమే మోక్ష అనే ఐలాండ్ చుట్టూ నడుస్తుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఐలాండ్ లో అడుగుపెట్టిన వారు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు? ఆ మిస్టరీని ఎలా చేదించారు అనే అంశంపై కొనసాగుతుందని సమాచారం. అయితే ఈ సిరీస్ ప్లాట్ ఏంటో తెలియాలంటే ట్రైలర్ రిలీజ్ అయ్యేదాకా ఎదురుచూడాల్సిందే. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్లతో రిలీజ్ కాబోతోందని తెలుస్తోంది. మొత్తానికి చాలా కాలం తర్వాత అచ్చ తెలుగు హారర్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుండడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు