OTT Movie : మనుషుల్ని మనుషులే పీక్కు తింటే… గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే ఈ మూవీ చూడండి

OTT Movie : ఇదివరకు బోర్ కొట్టి కొత్త సినిమా చూడాలి అంటే శుక్రవారం దాకా వెయిట్ చేయక తప్పని పరిస్థితి ఉండేది. కానీ ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఎన్నో రకాల జానర్ల సినిమాలు కోకొల్లలుగా అందుబాటులో ఉంటున్నాయి. చూసే ఓపిక, తీరిక ఉండాలి గాని ఎన్ని రోజులు చూసినా బోర్ కొట్టనని సినిమాలు, సిరీస్ లు పలు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇప్పటిదాకా చాలానే చూసాము ఏదైనా కొత్తగా చూడాలనిపిస్తోంది అనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఇది మైండ్ ను డిస్టర్బ్ చేసే మూవీ. కాబట్టి గుండె ధైర్యం ఉన్నవాళ్లు మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? టైటిల్ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

డిఫరెంట్ కంటెంట్ సినిమాలు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్. ఈ మూవీ కూడా ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ది ప్లాట్ ఫామ్. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అంటే దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో. ఇంకెందుకు ఆలస్యం ది ప్లాట్ ఫామ్ మూవీ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

The Hunger Problem: Why We're Living In The Movie, The Platform | by Jackie Williams | Age of Awareness | Medium

- Advertisement -

కథలోకి వెళ్తే…

ఓ గుహలో గోరింగ్ అనే వ్యక్తితో పాటు మరో ముసలాయన కూడా నివసిస్తాడు. కానీ అసలు అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం మాత్రం అతనికి ఏమాత్రం తెలీదు. దీంతో తనతో పాటే ఉండే ముసలాయన అక్కడ ఏం జరుగుతోంది ? ఆ ప్రాసెస్ ఏంటి అనే విషయాలను వివరంగా వివరిస్తాడు. ఆయన తెలిపే వివరాల ప్రకారం ఓ పెద్ద బిల్డింగ్ లో ఫ్లోర్స్ లా గుహలు ఉంటాయి. అందులో గదికి ఇద్దరు మనుషులు చొప్పున నివాసం ఉండేలా ఏర్పాట్లు చేస్తారు. పైగా ప్రతిరోజూ ఫుడ్ తో ఉన్న ప్లాట్ఫామ్ ప్రతి ఫ్లోర్ దగ్గర రెండు నిమిషాల పాటు ఆగుతుంది. అయితే పై ఫ్లోర్లో వాళ్ళు తిని మిగిల్చిన ఆహారాన్ని మనం తిని బ్రతకాలని ఆ ముసలాయన చెప్తాడు.

నిజానికి ఆ గుహలో 333 ఫ్లోర్స్ ఉంటాయి. అందులో ప్రతి రోజు ఒక్కొక్కరికి ఇష్టమైన ఫుడ్ ను టాప్ ఫ్లోర్ లో తయారు చేసి కిందకి పంపుతారు. అయితే పైన ఉన్న ఫ్లోర్స్ వాళ్ళు అవసరానికి మించి తినడంతో కింది ఫ్లోర్స్ వాళ్లకి ఫుడ్ అందదు. ఆకలిని తట్టుకోలేక మనుషుల్ని మనుషులే తాము బ్రతకడం కోసం చేయరాని పనులు చేస్తారు. తోటి మనుషుల్ని చంపేసి పీక్కు తింటూ బ్రతుకుతారు. ఇలాంటి చోటికి వచ్చిన గోరింగ్ కూడా ఇదే పని చేస్తాడు. అసలు హీరో అక్కడికి ఎందుకు అడుగు పెట్టాడు? ఆ గుహలో అసలు ఏం జరుగుతోంది? అతను అక్కడి నుంచి తప్పించుకోగలిగాడా? అనే విషయాలు తెలియాలంటే ఈ ప్లాట్ఫామ్ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు