OTT Movie : పిల్లాడి పాడు పనులు చూసి తల్లి షాక్… చెమటలు పుట్టించే సైకో కిల్లర్ మూవీ

OTT Movie : సైకో కిల్లర్ సినిమాలు అనగానే సస్పెన్స్ తో పాటు థ్రిల్లర్ అంశాలు కూడా మిళితం కావడంతో క్యూరియాసిటీ మరింత పెరుగుతుంది. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మూవీ ఒక వెరైటీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఆ పిల్లోడు చేసే పాడు పనులు చూసి తల్లి షాక్ అవుతుంది. మరి ఇంతకీ ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? ఈ మూవీ టైటిల్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ సైకో థ్రిల్లర్ జానర్ లో ఉంటుంది. ఈ మూవీ అంతా చిన్నపిల్లాడిని ఆత్మ ఆవహించడం, తనకు తెలియకుండానే హత్యలు చేయడం అని కాన్సెప్ట్ తో వచ్చింది. ఇంట్రెస్టింగ్ మూవీ పేరు ది ప్రాడిజి. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. గంటసేపు అద్భుతమైన థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ మూవీకి నికోలస్ మాక్ కార్తీ దర్శకత్వం వహించారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే ఈ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

The Prodigy (2019) | MUBI

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

స్టార్టింగ్ లోనే ఓ అమ్మాయి ఎదురుగా వచ్చే కారును ఆపేసి తన చేయిని నరికేసారని ఏడవడం వంటి హారర్ సన్నివేశంతో ఒళ్ళు జలదరిస్తుంది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అధికారులు వచ్చి ఆ సైకోని కాల్చి చంపేస్తారు. అయితే చనిపోయినప్పుడు ఆ కిల్లర్ చేతిలో ఆ అమ్మాయి చేయి అలాగే ఉంటుంది. సరిగ్గా ఈ సైకో చనిపోయే సమయానికి సారా, జాన్ అనే జంటకు కొడుకు పుడతాడు. ఆ బాబుకు మైల్స్ అని పేరు పెడతారు. అయితే విచిత్రంగా మైల్స్ కళ్ళు చనిపోయిన సైకో కళ్ళలాగే ఉంటాయి. ఇక పెరుగుతున్న కొద్దీ చిన్న ఏజ్ లోనే మైల్స్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అద్భుతమైన తెలివితేటలు ఉండడమే కాకుండా అర్థరాత్రి లేచి తనకు తెలియని భాషలో మాట్లాడుతూ తల్లిని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఇదంతా చూసి భయపడిన సారా తన కొడుకు చేసే వింత చేష్టలను రికార్డు చేస్తుంది.

ఆ తర్వాత రోజే స్కూల్ నుంచి సారాకు పిలుపు వస్తుంది. తన క్లాస్మేట్ ను మైల్స్ రాడ్ తో కొట్టాడనేది టీచర్ కంప్లైంట్. దీంతో సారా తన కొడుకు చేసిన వింత చేష్టలను టీచర్ కి చూపిస్తుంది. ఆమె వెంటనే సైక్రియాటిస్ట్ ను కలవమని చెప్తుంది. ముందుగా లైట్ తీసుకున్న సారా ఆ తర్వాత తన కొడుకు వింత పోకడలు చూసి సైక్రియాటిస్ట్ దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ మైల్స్ ఏకంగా డాక్టర్ ని బెదిరించి తనకు ఏ సమస్య లేదనే విషయాన్ని అతనితోనే చెప్పిస్తాడు. అయితే డాక్టర్ తో మాట్లాడుతున్న సమయంలో మైల్స్ తనకు తెలియకుండానే సోఫాపై ఓ పేరును రాస్తాడు. ఆ పేరు గురించి డాక్టర్ ద్వారా తెలుసుకున్న సారా గూగుల్ లో సెర్చ్ చేయగా భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ నిజం ఏంటి? సారా తన కొడుకుని ఎలా కాపాడుకుంది? కోరికను తీర్చుకోవడం కోసమే మళ్లీ పుట్టిన ఆ సైకో కిల్లర్ కోరిక నెరవేరిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీపై ఓ లుక్కెయ్యాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు