OTT Movie : ట్రెక్కింగ్ అంటే ఇష్టమా? ఈ హారర్ మూవీని చూస్తే మళ్ళీ డేర్ చేయరు

OTT Movie : అడ్వెంచర్స్ చేయడం, బయట అలా ప్రయాణాలు చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ? ఇక చాలా మంది ట్రెక్కింగ్ చేయడానికి కూడా ఇష్టపడతారు. కానీ అలాంటి వాళ్ళు ఈ హారర్ సస్పెన్స్ మూవీని చూశాక ట్రెక్కింగ్ అంటే వణికి పోతారు. మరి వెన్నులో వణుకు పుట్టించేంత భయంకరంగా ఉన్న ఈ హారర్ మూవీ ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది ? సినిమా స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీలో సీను సీనుకో ట్విస్ట్ కూడా ఉంటుంది. అలాగే సినిమాలో వచ్చే సీన్స్, హారర్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా భయపడతాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ది రిట్చువల్. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

On Netflix: The Ritual is a deep examination of judgement and escapism - The Big Smoke

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

అలా సరదాగా ట్రెక్కింగ్ చేయాలనుకున్నప్పుడు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తే ఆ మజానే వేరు. సినిమాలో కూడా అలాగే అనుకుని నలుగురు ఫ్రెండ్స్ కలిసి ట్రెక్కింగ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో అందులో ఒకరు ప్రమాదవశాత్తూ చనిపోతారు. అయితే అతనికి అక్కడే అంత్యక్రియలు నిర్వహించి, నివాళి అర్పించి మిగతా వాళ్ళు తిరిగి ఇంటికి వెళుతూ ఉంటారు. ఇలా వెనక్కి వెళ్లే క్రమంలోనే కొండల్లో నడుస్తున్న టైం లో మిగిలిన వారిలో ఒకరికి గాయం అవుతుంది. అయితే కాలికైన గాయం కారణంగా అతను నడవలేని పరిస్థితిలో ఉండడంతో కొండల దారి కాకుండా అడవిలో నుంచి వెళ్లే దారిని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ అడవిలో మాత్రం ఎన్నో భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. పైగా వాళ్లను అలర్ట్ చేసేలా ఓ షాకింగ్ విషయం కూడా జరుగుతుంది.

కానీ ఆ అడవి గురించి తెలియని వీళ్లు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. జస్ట్ ప్రమాదం అనుకుని అలా ముందుకు సాగుతారు. ఈ క్రమంలోనే ఒక చోట మేకను బలి ఇచ్చినట్టుగా కనిపించడంతో పాటు ఏదో అర్థం కాని భాషలో వింత అక్షరాలతో రాసి ఉంటుంది. దాన్ని చూసి కూడా ముందుకెళ్లి కొంత దూరంలో క్యాంపింగ్ ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ ఫ్రెండ్స్ కి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టదు సరికదా అందరికీ ఒకే కల వస్తుంది. కలలో ఎవరో మనుషులు కనిపించడంతో పాటు మృతదేహాలు, ఆత్మలు కూడా రావడంతో ఉలిక్కిపడతారు. కానీ లేచాక వాళ్లలో వాళ్లే పీడకల అనుకుని మళ్ళీ ముందుకు సాగుతారు. కానీ నిజానికి వాళ్లు ఎంత ముందుకు వెళ్తే ప్రమాదం అంత దగ్గర అవుతున్నట్టు. కానీ ఈ విషయం తెలిసేసరికి ఆలస్యం అయిపోతుంది. మరి ఇంతకీ వారిలో ఎంత మంది ప్రాణులతో బయటపడగలిగారు? అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది? అసలు ఈ ట్విస్ట్ ఏంటి? అనే విషయం తెలియాలంటే ది రిట్చువల్ అనే ఈ సస్పెన్స్ హారర్ మూవీ పై ఓ లుక్ వెయ్యండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు