OTT Movie : వెన్నులో వణుకు పుట్టించే సైకలాజికల్ థ్రిల్లర్… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని మూవీ

OTT Movie : హర్రర్ సినిమాలంటేనే ఆసక్తికరంగా ఉంటాయి. అయితే హారర్ ఎలిమెంట్స్ కి సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను జోడిస్తే ఎలా ఉంటుంది ? మనమైతే ఆలోచించడం కష్టం గానీ ఓ డైరెక్టర్ ఈ పనిని చేసి చూపించాడు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా హారర్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ అంశాలను కలగలిపి ఈ భయంకరమైన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించారు. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీని చిన్నపిల్లలతో పాటు హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు కూడా చూడకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ అంతా భయంకరంగా, వైలెంట్ గా ఉంటుంది. ఏదైనా రోగం వస్తే డాక్టర్ లు నయం చేస్తారు. అలా రోగం నయం చేయడానికి ఓ పేషెంట్ దగ్గరకు వెళ్ళిన డాక్టర్లే దెయ్యాలను చూస్తే ఎలా ఉంటుంది అనేదే స్టోరీ. ఈ ఇంగ్షీషు మూవీ పేరు ది టేకింగ్ ఆఫ్ డెబోరా లోగాన్. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

The Taking Of Deborah Logan Ending Explainedకథలోకి వెళ్తే….

లియా, గివిస్, లూయిస్ అనే ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ చుట్టూనే ఈ కథ మొత్తం తిరుగుతుంది. అల్జిమస్ గురించి డాక్యుమెంటరీ చేసే క్రమంలో ఈ ముగ్గురూ కలిసి ఆ వ్యాధి ఉన్న ఒక పేషెంట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. ఆ పేషెంట్ పేరు డేబోరా లోగాన్. ఈ పేషెంట్ కు అల్జీమర్స్ ఉందని తెలుసుకుని పర్సనల్ గా ఆమెను కలిసి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటారు ముగ్గురు డాక్టర్లు. కానీ ఆమె మాత్రం దానికి ఒప్పుకోదు. అయితే డబ్బు కోసం కూతురు బలవంతం చేయడంతో తప్పక ఒప్పుకుంటుంది. ఇక ఈ ముగ్గురు మెడికల్ స్టూడెంట్స్ కలిసి ఆమెను దగ్గరగా పరిశీలిస్తూ పలు వింత వింత విషయాలను తెలుసుకుంటారు. కానీ సడన్ గా డెబోరా ఊహించని విధంగా ప్రవర్తించడం వాళ్ళని భయపెడుతుంది. ఈ క్రమంలోనే ఆమెకు అల్జీమర్స్ వ్యాధి కాదు ఇంకేదో ఉందని తెలుసుకుంటారు.

- Advertisement -

అయితే అదేదో అతీత శక్తి ఆవహించి ఉందేమోనని అనుమానపడతారు. దీంతో మొత్తానికి ఈ కేసును ఎలాగైనా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యి ఆ ముగ్గురు డాక్టర్లు కూడా అక్కడే ఉండి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఆమెకు ఉన్న జబ్బును కనిపెట్టాలని పరిశోధనలు చేస్తారు. ఈ క్రమంలోనే వాళ్లకు అప్పుడప్పుడు కొన్ని పాములు కనిపిస్తాయి. ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అసలు ఈ పాములు అక్కడకు ఎందుకు వస్తున్నాయి ? డెబోరాకు ఏదైనా దయ్యం పట్టిందా, లేదంటే ఇంకేదైనా రోగం ఉందా ? ఆ ముగ్గురు స్టూడెంట్స్ డెబోరా వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది ? చివరకు స్టోరీ ఎలా ఎండ్ అయింది ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ మూవీని తప్పకుండా చూడాల్సిందే. ముఖ్యంగా హారర్ మూవీ లవర్స్ డోంట్ మిస్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు