OTT Movie : రూపాలను మార్చుకుని వెంటాడే వింత జీవులు… ఆ అడవిలోకి కాలు పెడితే తిరిగి రావడం కలే

OTT Movie : హాలీవుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ప్రపంచంలో ఎక్కడా కనీసం ఊహించలేని వింత జీవులతో తెరకెక్కే ఇంట్రెస్టింగ్ సినిమాలు. ఇప్పటిదాకా ఇలాంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయి ప్రపంచ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి. ఈరోజు కూడా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మూవీని మన మూవీ సజెషన్లో చెప్పకోబోతున్నాం. రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. మరి ఇంతకీ ఆ మూవీ పేరేంటి? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

ప్రైమ్ వీడియోలో..

ప్రస్తుతం మనం చెప్పుకోబోయే మూవీ కంప్లీట్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి మొదలు పెడితే క్లైమాక్స్ వరకు సీన్ సీనుకో ట్విస్ట్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ థ్రిల్లింగ్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఈ మూవీని ఫ్రీగా చూసే ఛాన్స్ లేదు. రెంట్ బేసిస్ లో అందుబాటులో ఉంది. డైరెక్టర్ ఇషానా నైట్ ఈ మూవీలో చూపించిన ట్విస్ట్ దిమ్మతిరిగేలా చేస్తుంది. సినిమా మొత్తానికి క్లైమాక్స్ హైలెట్ అని చెప్పొచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ పేరు ది వాచర్స్.

The Watchers 2024 - Release Date, Thriller, In-Cinemas

- Advertisement -

కథలోకి వెళ్తే..

జాన్ అనే వ్యక్తి ఓ అడవిలో చిక్కుకుపోతాడు. ఎక్కడికి వెళ్ళినా సరే 108 అనే నెంబర్ తో ఉన్న బోర్డు మాత్రమే కనిపిస్తుంది. అంతలోనే ఓ వింత క్రియేచర్ వచ్చి జాన్ ను లాక్కెల్లిపోతుంది. ఆ తర్వాత పెట్ షాప్ లో పని చేస్తున్న ఓ హీరోయిన్ కస్టమర్ కు గోల్డెన్ పారెట్ ను డెలివరీ చేయడానికి వెళుతుంది. అయితే ఆ ప్లేస్ చాలా దూరంగా ఉంటుంది. సడన్ గా అడవి మధ్యలో ఆమె కారు ఆగిపోతుంది. దీంతో దిగి ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చూసే లోపే ఆ కారు కనిపించకుండా పోతుంది. మరోవైపు ఒక క్యాబిన్లో ముసలావిడ కనిపించడంతో భయపడుతూనే అక్కడికి వెళుతుంద.

అయితే ఆ ముసలి ఇక్కడ కొన్ని వింత జీవులు ఉంటాయని, వాటిని వాచర్స్ అని పిలుస్తామని, అవి తమను చూడకుండా ఉండడానికే ఆ క్యాబిన్ లో నుంచి బయటకు కనిపించకుండా ఇలా సెట్ చేసామని చెప్తుంది. అలాగే తనతో పాటు ఉన్న వ్యక్తుల్ని హీరోయిన్ కి పరిచయం చేస్తుంది. కానీ నెక్స్ట్ డే హీరోయిన్ ఇదేదో తేడాగా ఉంది అని పారిపోయే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ముసలావిడ హీరోయిన్ ని మళ్లీ పట్టుకొస్తుంది. ఇక ఆ తర్వాత ఒకానొక సందర్భంలో హీరోయిన్ వాచర్స్ కి కోపం తెప్పిస్తుంది. ఆ తర్వాత అసలు విషయం తెలిసి వాటిని నమ్ముతుంది. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కి ఆ ముసలావిడ ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తుంది. అసలు ఆ వింత జీవులు ఏంటి? ఒకప్పుడు ఫెయిరీ లాగా ఉన్న ఈ వాచర్స్ ఎందుకు ఇప్పుడు మనుషులపై దాడి చేస్తున్నాయి? మనుషుల రూపంలోకి మారడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ? అనే విషయాలు తెలియాలంటే ది వాచర్స్ అనే మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు