OTT : హైవేపై ఒకే చోట వరుస యాక్సిడెంట్స్… చివరి దాకా ఏం జరుగుతుందో కనిపెట్టలేని త్రిష మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సాధారణంగా వచ్చే ఇలాంటి సినిమాలకంటే అందులో స్టార్ హీరోలు హీరోయిన్లు నటిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. కానీ ఈ జానర్ సినిమాలకు చాలా వరకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా ఓటిటిలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. నిజానికి అసలు అలాంటి మంచి సినిమాలు ఓటీటీలో ఉన్నాయి అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. మంచి సస్పెన్స్ సినిమా కోసం వెతుకుతున్న వాళ్ళ కోసమే ఈ ఓటిటి మూవీ సజెషన్. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే సాధారణంగా మనం చూసే సస్పెన్స్ సినిమాలలో నటీనటులు ఎవరు అన్న విషయం పెద్దగా తెలియదు. కానీ ఈ మూవీలో చెన్నై చిన్నది త్రిష హీరోయిన్ గా నటించడం విశేషం. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? త్రిష నటించిన ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరేంటి ? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

ఆహాలో స్ట్రీమింగ్..

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పొచ్చు. అరుణ్ వశీకరణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీకి లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్దగా కలిసి రాలేదు. కానీ ఈ మూవీ మాత్రం బాగుంటుంది. స్వయంగా త్రిష ఈ కేసును సాల్వ్ చేయడానికి రంగంలోకి దిగి ఒంటరి పోరాటం చేస్తుంది. అయితే త్రిష కోసం కాకపోయినా స్టోరీ కోసమైనా ఈ మూవీని చూసి తీరాల్సిందే. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మూవీ టైటిల్ ది రోడ్. ప్రస్తుతం ఈ మూవీ ఆహాలో అందుబాటులో ఉంది. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

The Road' trailer: Trisha to unravel a series of mysterious accidents -  India Today

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

మీరా అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి కొడైకెనాల్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ ఆమె ప్రెగ్నెంట్ గా ఉండడంతో డాక్టర్లు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళొద్దని చెప్తారు. దీంతో చివరి నిమిషంలో మీరా కొడైకెనాల్ ట్రిప్ నుంచి డ్రాప్ అయిపోగా, భర్త కొడుకు మాత్రం బయలుదేరుతారు. కానీ ఊహించని విధంగా వాళ్ళిద్దరూ కార్ యాక్సిడెంట్ లో చనిపోయారనే వార్త మీరాను కుంగదీస్తుంది. ఇక ఆ బాధ నుంచి కోలుకున్న తర్వాత మీరాకు తన భర్త కొడుకు చనిపోయిన ప్లేస్ ను చూడాలని అనిపిస్తుంది.

తీరా అక్కడికి వెళ్లి చూశాక అది యాక్సిడెంట్ కాదని ఆమెకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఆమె మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ లో ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఓకే హైవేలో ఒకే చోట వరుసగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని గమనిస్తుంది. మరి ఇంతకీ అసలు ఆ ప్లేస్ లోనే ఎందుకు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి? దీనంతటి వెనక ఉన్నది ఎవరు? అవి నిజంగానే ప్రమాదాల లేక హత్యలా? మీరా ఈ విషయాలన్నింటినీ ఎలా కనిపెడుతుంది? అనే ఇంట్రెస్టింగ్ అంశాలన్నీ తెలుసుకోవాలంటే ది రోడ్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు