OTT Movie : ఫోన్ వాడితే చంపేసే సైకో… వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్లర్ మూవీ

OTT Movie : ప్రస్తుతం ఎక్కడ చూసినా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతుల్లోనూ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఇక కొంతమంది అయితే ఫోన్లు లేకపోతే బ్రతకలేమేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ప్రతి నిమిషం చేతిలో ఫోన్ ఉండి తీరాల్సిందే. కానీ ఇలా ఫోన్ పట్టుకుని తిరిగేవాళ్లు కనిపించారంటే మాత్రం ఈ సైకో చేతిలో చచ్చారే. ఇలా ఫోన్ వాడితే చంపేసే సైకో కిల్లర్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. సైకో థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సీరియల్ కిల్లర్ మూవీ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. సైబర్ క్రైమ్ పాయింట్ తో పాటు సీరియల్ కిల్లర్ అనే రెండు ప్లాట్స్ మిక్స్ చేసి ఒకే కథలో చూపించారు డైరెక్టర్. మరి ఇంతకీ ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉన్న మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఫోన్ హ్యాక్ చేసి అదే ఫోన్ వాడేవారిని చంపేసే ఈ సైకో కిల్లర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు అన్ లాక్డ్. ఇక ఈ మూవీ ని చూశాక కచ్చితంగా ఫోన్ వాడాలంటే ఒకసారి ఆలోచనలు పడతారు. మరి ఫోన్ పట్టుకోవడానికి టెన్షన్ పుట్టించే ఈ మూవీ స్టోరీ ఏంటంటే…

Watch Unlocked | Netflix Official Siteఈ సినిమాలో హీరోయిన్ కి ఫోన్ అడిక్షన్ ఉంటుంది. ఎక్కడికెళ్తోంది, ఏం చేస్తోంది, ఎవరిని కలిసింది అనే ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. ఇంకేముంది ఆమె ఎప్పుడు ఏం చేస్తుంది అనే విషయం సోషల్ మీడియాను వాడే ప్రతి ఒక్కరికి ఈజీగా తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఓ రోజు ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లిన హీరోయిన్ తిరిగి వచ్చేటప్పుడు బస్సు లోనే తన ఫోన్ ను మర్చిపోతుంది. ఇక్కడే స్టోరీ టర్న్ అవుతుంది. ఆ ఫోన్ ఓ సైకో కిల్లర్ చేతికి దొరకడంతో ఆట మొదలవుతుంది. నెక్స్ట్ డే ఈ సైకో కిల్లర్ తన గొంతు మార్చుకుని ఆ ఫోన్ బస్సులో దొరికిందని చెప్తాడు. అతన్ని దగ్గర్లో ఉన్న ఓ రెస్టారెంట్లో కలిసి ఫోన్ తీసుకుంటానని చెప్తుంది. అంతలోపు ఈ సైకో ఆమె ఫోన్ ను అన్లాక్ చేసి డీటెయిల్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ పనవ్వకపోవడంతో దాన్ని పగలగొడతాడు. మరోవైపు సిటీలో వరస హత్యలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా కొండపైన ఇంట్లో ఓ అమ్మాయి డెడ్ బాడీ కనిపిస్తుంది. అందులోనూ ఆమె వేళ్ళను కట్ చేసి ఉంటారు. ఆ కేసును ఇన్వెస్ట్ గేట్ చేస్తున్న పోలీస్ కి తన కొడుకు పైనే డౌట్ మొదలవుతుంది. ఇక కట్ చేస్తే ఈ సైకో కిల్లర్ హీరోయిన్ కి ఫోన్ చేసి ఫోన్ పగిలింది రిపేర్ కి ఇచ్చాను అక్కడికి వెళ్లి తీసుకోమని చెప్తాడు. కానీ అక్కడ అతనే ఉండి హీరోయిన్ దగ్గర ఫోన్ పాస్వర్డ్ తీసుకుంటాడు. ఇక అప్పటినుంచి ఆమె ఏం చేస్తుందో అతనికి ఈజీగా తెలిసిపోతుంది. మరి ఆ తర్వాత ఈ సైకో కిల్లర్ ఏం చేశాడు? వరుస హత్యలకు పాల్పడేది, ఇతను ఒక్కడేనా ? అనే విషయాలు తెలియాలంటే అన్లాక్డ్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు