OTT Movie : పిల్లలు పుట్టరని తెలిసి ఆ పని చేసే భార్య… బిడ్డ పుట్టాక అసలు విషయం తెలిసిన భర్త ఏం చేస్తాడంటే?

OTT Movie : టైటిల్ వినడానికి బోల్డ్ గానే ఉన్నప్పటికీ ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల్ని పక్కన పెట్టేసి కుటుంబంలోని పెద్ద వారంతా కలిసి చూడగలిగే సినిమా ఇది. తన భర్తకు పిల్లలు పుట్టరని తెలిసిన ఆ భార్య తీసుకునే షాకింగ్ స్టెప్ భర్తను కోపంతో వెర్రెక్కిపోయేలా చేస్తుంది. మరి పిల్లాడు పుట్టాక ఆ భర్త ఏం చేశాడు అనే విషయం తెలియాలంటే ఈ ఇంట్రెస్టింగ్ మూవీపై ఓ లుక్కెయాల్సిందే. మరి ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు వెప్పమ్ కులిర్ మజై. ఈ సోషల్ థ్రిల్లర్ మూవీ మార్చ్ 29న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో ఇస్మత్ భాను, ఎమ్మెస్ భాస్కర్ అండ్ ప్రధాన పాత్రలు పోషించగా, ధీరజ్ నిర్మించారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Veppam Kulir Mazhai Movie (2024) | Release Date, Cast, Trailer, Songs,  Running at nearest Theater

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

రాజు అనే వ్యక్తి ఊర్లో ఆవులకు గర్భం దాల్చడానికి ఇంజక్షన్లు వేస్తూ బతుకు బండిని నడిపిస్తాడు. అయితే ఈ నేపథ్యంలోనే రాజుకు రమ అనే అమ్మాయితో పెళ్లి అవుతుంది. పెళ్లయి దాదాపు ఐదేళ్లు గడిచిన ఈ జంటకు పిల్లలు పుట్టరు. దీంతో కుటుంబంలో మనస్పర్ధలు మొదలవుతాయి. ముఖ్యంగా అత్త పోరు మొదలవుతుంది కోడలికి. అలాగే రాజు కూడా ఎక్కడికి వెళ్లినా దెప్పిపొడుపులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలోనే ఊళ్లో వాళ్ళు రమను డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోమంటూ సలహా ఇస్తారు. కానీ మరి కొంతమంది మాత్రం ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకోమని రాజుకి ఉచిత సలహాలు ఇచ్చి అతని మనసు మార్చే ప్రయత్నం చేస్తారు. కానీ రాజు మాత్రం వేరే పెళ్లికి ఒప్పుకోడు.

ఈ క్రమంలో డ్రామా డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆమెకు త్వరలోనే పిల్లలు పుడతారని చెప్తారు. అయితే ఎన్ని రోజులు వెయిట్ చేసినా పిల్లలు మాత్రం పుట్టరు. ఇక ఊళ్లో వాళ్ళు చేసే హేళనను తట్టుకోలేక రాజు డీలాపడతాడు. దీంతో అతని బాధను చూసి రమా రాజుకి రెండో పెళ్లి చేసుకోమని చెప్తుంది. కానీ అతను మాత్రం ససేమిరా ఇంకొకరిని పెళ్లి చేసుకోను అంటాడు. దీంతో ఏం చేయాలో తోచక రమ ఐవిఎఫ్ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడానికి సిద్ధమవుతుంది. ఇంట్లో మాత్రం అసలు విషయాన్ని చెప్పదు. మొత్తానికి ఒకరోజు తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఇంట్లో చెప్పేస్తుంది. దీంతో అందరూ తెగ సంబరపడిపోతారు. ఇక బేబీ పుట్టిన తర్వాత రమా తన భర్తకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది? రాజుకు పిల్లలు పుట్టారు అనే విషయాలను చెప్పేస్తుంది. దీంతో విపరీతమైన కోపం తెచ్చుకున్న రాజు పిచ్చివాడిలా ప్రవర్తిస్తూ కోప్పడతాడు. మరి చివరికి ఈ జంట ఆ పిల్లాడిని ఏం చేసింది? ఈ సినిమాలో హ్యాపీ ఎండింగ్ ఉంటుందా? అసలు ఈ జంటకు ఎందుకు పిల్లలు పుట్టలేదు? అనే విషయాలు తెలియాలంటే మూవీని చూస్ తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు