OTT Movies : రాఖీ రోజు ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు సినిమాలు ఇవే

OTT Movies : రాఖీ పండగ వచ్చేసింది. ఈ స్పెషల్ డే రోజున ఇంట్లోనే ఉండి తోబుట్టువులను చూడాలి అనుకునే వారి కోసం ఈ రోజు మన మూవీ సజెషన్. సౌత్‌లోని కొన్ని బెస్ట్ చిత్రాల గురించి చెప్పబోతున్నాము. ఈ రక్షాబంధన్ రోజు ఫ్యామిలీతో కలిసి మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం పదండి.

శివరామరాజు

ఈ సినిమాలో ముగ్గురు అన్నదమ్ములు, వారి ఒక సోదరి ఉంటుంది. ఆ ముగ్గురి పేరు శివ, రామ్, రాజు. సోదరి పేరు స్వాతి. ఇందులో జగపతిబాబు హీరోగా నటించాడు. అన్నదమ్ములు, ఒక సోదరి ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘శివరామరాజు’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ముగ్గురు అన్నదమ్ములకు చెల్లెలు అంటే ప్రాణం. ఆమెను కాలు కింద పెట్టనీయకుండా  పెంచిన అన్నదమ్ములు ఆమె వల్లే కష్టాల పాలవుతారు. ఆమెను ధనవంతుడైన వ్యక్తికి ఇచ్చి వివాహం చేస్తారు. ఆ తర్వాత కథలో ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది.

అర్జున్

ఈ లిస్ట్‌లో మహేష్ బాబు సినిమా ‘అర్జున్’ పేరు కూడా తప్పకుండా ఉంటుంది. అర్జున్ కవల సోదరి మీనాక్షి తన తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఉదయ్‌ ని పెళ్లి చేసుకుంటుంది. ఆ తరువాత అతని అత్తమామలు అమ్మాయిని చంపాలని నిర్ణయించుకుంటారు, అయితే అర్జున్ తన సోదరిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు. మీరు దీన్ని డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో చూడవచ్చు.

- Advertisement -

Raksha Bandhan Songs,Rakhi Pandaga Paatalu: రక్షా బంధన్.. అన్నాచెల్లెళ్ల  అనుబంధాన్ని చాటే సినిమా పాటలు - rakhi panduga special telugu full video  songs; happy raksha bandhan festival - Samayam Telugu

పుట్టింటికి రా చెల్లి

పుట్టింటికి రా చెల్లి అనేది కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఎమోషనల్ డ్రామా. ఇందులో అర్జున్ , మీనా, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించారు. 2004 ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం 2002 కన్నడ చిత్రం తవారిగే బా తంగికి రీమేక్. ఈ మూవీ ప్రైమ్ వీడియోతో పాటు యూట్యూబ్ లో కూడా అందుబాటులో ఉంది.

గోరింటాకు

విఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన అన్నాచెల్లెళ్ల ఎమోషనల్ మూవీ గోరింటాకు. ఇందులో రాజశేఖర్ , మీరా జాస్మిన్ , ఆర్తీ అగర్వాల్, ఆకాష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం శివ రాజ్ కుమార్ నటించిన సూపర్ హిట్ కన్నడ చిత్రం అన్న తంగికి రీమేక్. ఎస్‌ఏ రాజ్‌కుమార్‌ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 4 జూలై 2008న విడుదలైంది. ఇప్పుడు జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇంకా రాఖి రోజు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన రాఖి మూవీ, పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరం సినిమాలు కూడా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ కూడా సిస్టర్ అండ్ బ్రదర్ సెంటిమెంట్ తో రూపొందిన మూవీనే. ఈ సినిమాలన్నీ యూట్యూబ్ లోనే ఫ్రీగా చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రాఖీ రోజు కుటుంబ సభ్యులతో ఈ సినిమాలను చూసి ఎంజాయ్ చేయండి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు