OTT Movies : IMDBలో టాప్ రేటింగ్ లో ఉన్న బెస్ట్ మూవీస్… ఇంకా చూడలేదా?

OTT Movies : IMDbలో అత్యధిక రేటింగ్ పొందిన సినిమాలను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాము. OTTలో చూడటానికి చాలా సినిమాలు ఉన్నప్పటికీ, కొన్ని సార్లు ఏది చూడాలో నిర్ణయించుకోవడం చాలా కష్టంగా మారుతుంది. చాలా సార్లు మనం ఏదైనా చూడటం మొదలు పెట్టి దాని కథ బోరింగ్ గా అనిపించడం వల్ల కంప్లీట్ గా చూడకుండానే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి సమస్యలను ఫేస్ చేసేవారి కోసమే ఈ రోజు మేము IMDb ద్వారా అత్యధిక రేటింగ్ పొందిన సినిమాల లిస్ట్ ను మీ ముందుకు తీసుకొచ్చాము. ఇంకా మీరు వాటిని చూడకపోతే వెంటనే ఓ లుక్కేయండి.

ట్వెల్త్ ఫెయిల్

ఈ జాబితాలో ముందుగా చెప్పుకోవాల్సింది విక్రాంత్ మాస్సే చిత్రం ‘ట్వెల్త్ ఫెయిల్’. డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు IMDbలో 8.9 రేటింగ్ వచ్చింది. ఇక జనాలు కూడా ఈ సినిమాను బాగా ఆదరించారు. రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అట్టడుగు వర్గం నుంచి వచ్చిన వ్యక్తి ఐఏఎస్ కావడానికి ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు? చివరకి తన ఆశయాన్ని ఎలా సాధించాడు? అనే స్టోరీతో రూపొందించారు.

మహారాజా

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘మహారాజా’ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు థియేటర్లలో అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. సినిమా కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తండ్రి కూతుర్ల స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా మనసును కదిలిస్తుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. దీనికి 8.7 రేటింగ్‌ వచ్చింది.

- Advertisement -

రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్

భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్’ చిత్రానికి 8.7 రేటింగ్ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా, ఆయనపై నటనపై ప్రశంసలు కురిశాయి. అంతేకాదు ఈ సినిమాలో నంబికి జరిగిన అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చుపించారు. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణ్ కథ ఆధారంగా తెరకెక్కిన 'రాకెట్రీ ది నంబి ఎఫెక్ట్' చిత్రానికి 8.7 రేటింగ్స్ వచ్చాయి. ఈ చిత్రంలో ఆర్ మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

777 చార్లీ

‘777 చార్లీ’ కూడా గొప్ప సినిమా. మనిషికి, కుక్కకు మధ్య ఉండే అనుబంధాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి 8.7 రేటింగ్‌ ఉంది. ఈ మూవీ కూడా ప్రైమ్ విడియోలోనే అందుబాటులో ఉంది.

లాపాటా లేడీస్

ఈ జాబితాలో అమీర్ ఖాన్ చిత్రం ‘లాపాటా లేడీస్’ పేరు కూడా చేరింది. IMDb ఈ చిత్రానికి 8.4 రేటింగ్ ఇచ్చింది. చిన్న సినిమాగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది. దీనికి సెలబ్రిటీల నుంచి కూడా మంచి సపోర్ట్ దక్కింది. అలియా భట్ లాంటి హీరోయిన్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

3 ఇడియట్స్

అమీర్ ఖాన్, శర్మన్ జోషి, ఆర్ మాధవన్ కలిసి నటించిన ‘3 ఇడియట్స్’ చిత్రం కూడా ఈ లిస్ట్ లో ఉంది. ఈ చిత్రానికి 8.4 రేటింగ్ ఉంది

దంగల్.

అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ కూడా చాలా మంచి మూవీ. నిజమైన కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు IMDb 8.3 రేటింగ్ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు