OTT Movies : సౌత్ నుంచి నార్త్ దాకా… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు చూడకూడని క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు

OTT Movies : నేటి డిజిటల్ యుగంలో ఓటీటీలు కూడా మన జీవితంలో ఒక భాగం అయ్యాయి. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేదు అంటే వింత జీవులను చూసినట్టుగా చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీలో ప్రతి వారం వరుసగా సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో క్రైమ్, థ్రిల్లర్ నుండి కామెడీ వరకు ప్రతి జానర్‌కు చెందిన సినిమాలు ఉన్నాయి. అయితే మీరు ఈ మూడింటిని ఒకే చిత్రంలో చూడాలనుకుంటే ఈ రోజు మేము మీ కోసం అలాంటి కొన్ని సినిమాలను ఈరోజు మూవీ సజెషన్ లో తీసుకువచ్చాము. వీటిని మీరు OTTలో ఇంట్లో కూర్చొని చూడవచ్చు. ఈ సినిమాలలో విపరీతమైన డ్రామా, క్రైమ్, థ్రిల్‌ వంటి అంశాలను చూడవచ్చు.

రోర్

రోర్ అనేది సోనాక్షి సిన్హా, గుల్షన్ దేవయ్య నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు రీమా కగ్టి రుచికా ఒబెరాయ్ దర్శకత్వం వహించారు. ఇది హృదయాన్ని కదిలించే డ్రామా ఆధారిత సిరీస్. ఇందులో సోనాక్షి సిన్హా మహిళా పోలీసు అధికారి పాత్రలో కనిపించింది. ఈ క్రమంలో ఆమె ఓ సైకో కిల్లర్‌ను వెంబడిస్తోంది. మీరు ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ ను చూడవచ్చు.

బ్రీత్

అమిత్ సాద్, ఆర్. మాధవన్, నీనా కులకర్ణి ప్రధాన పాత్రల్లో మయాంక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన స్పై మూవీ ‘బ్రీత్’. ఈ చిత్రం కథ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ కబీర్ చుట్టూ తిరుగుతుంది, అతను అవయవ దాతల మరణాలకు కారణమైన వ్యక్తి కోసం వెతుకుతాడు. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమాను చూడవచ్చు.

- Advertisement -

,

అధుర

‘అధుర’ అనేది బాలీవుడ్ సస్పెన్స్ హారర్ సిరీస్. ఇందులో ఇష్వాక్ సింగ్, జోవా మొరానీ, రసిక దుగల్, శ్రేనిక్ అరోరా, పూజన్ ఛబ్రా, అర్జున్ దేస్వాల్ తో పాటు పలువురు ప్రముఖులు నటించారు. నీలగిరి వ్యాలీ స్కూల్‌లో జరుగుతున్న వింత సంఘటనల ఆధారంగా వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా చేసే ఈ థ్రిల్లర్ సిరీస్ ను మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడవచ్చు.

జానే జాన్

బాలీవుడ్ స్టార్స్ కరీనా కపూర్ ఖాన్, విజయ్ వర్మ, జైదీప్ అహ్లావత్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘జానే జాన్’ కూడా ఈ లిస్ట్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సిన మూవీ. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తల్లి కూతుర్లు కలిసి చేసే క్రైమ్ చుట్టూ తిరుగుతుంది. అలాగే ఒక మిస్టీరియస్ స్కూల్ టీచర్ కూడా ఈ సినిమాలో ఉండే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఒక వేళ జానే జాన్ సినిమాను మీరు ఇంకా చూడకపోతే నెట్‌ ఫ్లిక్స్‌లో చూడవచ్చు.

ధూత

ఈ హారర్ థ్రిల్లర్‌కి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించారు ఇందులో ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువోతు, ప్రియా భవానీ శంకర్, నాగ చైతన్య, రవీంద్ర విజయ్, జ్ఞానేశ్వరి కాండ్రేగుల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందంటే వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ప్రైమ్ వీడియోలో దీన్ని చూడవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు