OTT Series : ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో తెలుసా?

OTT Series : ఎంతటి సంపన్నులైనప్పటికీ కొంతమంది బుక్స్ చదవడం, సినిమాలు చూడడం లాంటి హాబీలను మాత్రం అస్సలు వదులుకోరు. అలాంటి వారిలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే పుస్తకాలు చదవడం, వెబ్ సిరీస్ లు, సినిమాను చూడడం లాంటి వాటిని మాత్రం పొరపాటున కూడా మిస్ చేయరు. అలాగే ప్రతి సంవత్సరం సమ్మర్ లో చదవాల్సిన బుక్స్, చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో కూడా ఆయన సోషల్ మీడియా ద్వారా సజెస్ట్ చేయడం విశేషం. ఎప్పటిలాగే ఈసారి కూడా బిల్ గేట్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ పుస్తకాలను, సిరీస్ ను రికమెండ్ చేశారు. మరి ఈసారి ఆయనకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…

బిల్ గేట్స్ మెచ్చిన సిరీస్…

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు బిల్ గేట్స్. మైక్రోసాఫ్ట్ అధినేతగా, ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఆయన అందరికీ సుపరిచితుడే. ఇలాంటి వ్యక్తి ఎంత బిజీగా ఉంటాడో చెప్పనవసరం లేదు. కానీ ఆయన మాత్రం ఎంత బిజీగా ఉన్నా సరే ఈమధ్య సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చూస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి తనకు నచ్చిన వెబ్ సిరీస్ ఏంటో ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. బిల్ గేట్స్ కు నచ్చిన వెబ్ సిరీస్ పేరు స్లో హార్సెస్. నిజానికి ఇదొక బ్రిటిష్ వెబ్ సిరీస్.

Slow Horses Season 2 Review: Gary Oldman impresses once again amid Russians  spies and undercover operatives

- Advertisement -

ఈ సిరీస్ ఎందుకు నచ్చిందంటే?

తాజాగా బిల్ గేట్స్ తన బ్లాగ్ లో స్పై గేమ్, త్రీ డేస్ ఆఫ్ ద కాండోవర్ అనే సినిమాలంటే తనకు చాలా ఇష్టం అని వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే ఈ స్లో హార్సెస్ సిరీస్ కూడా ఉందని రాస్కొచ్చారు. అంతేకాదు తనకు ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ ఎందుకు నచ్చింది అనే కారణాలు కూడా బయట పెట్టారు బిల్ గేట్స్. స్లో హార్సెస్ అనేది బ్రిటిష్ సిరీస్. బ్రిటన్ సీక్రెట్ ఏజెన్సీ ఎమ్ఐ5 లో ఉన్నట్టుగా ఓ కల్పిత స్లాబ్ హౌస్ లో పని చేసే అండర్ కవర్ ఏజెంట్స్ చుట్టూ ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ స్లాబ్ హౌస్ లో గ్యారీ ఓల్డ్ మాన్ హెడ్ గా ప్రధాన పాత్రను పోషించారు. జేమ్స్ బాండ్ కు పూర్తిగా ఈ పాత్ర వ్యతిరేకం అంటూ బిల్ గేట్స్ రాసుకొచ్చారు. ఇక ఈ స్లో హార్సెస్ వెబ్ సిరీస్ ఇండియాలో యాపిల్ టీవీ ప్లస్ అనే ఓటిటిలో అందుబాటులో ఉంది.

గత ఏడాది బిల్ గేట్స్ కు నచ్చిన సిరీస్ ఇదే

ఇప్పుడు చెప్పినట్టుగానే గతేడాది కూడా బిల్ గేట్స్ తనకు నచ్చిన వెబ్ సిరీస్ గురించి వెల్లడించారు. నెట్ ఫ్లిక్స్ లో డ్యానిష్ భాషలో స్ట్రీమింగ్ అవుతున్న బోర్జెన్ తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు గేట్స్. అదొక పొలిటికల్ డ్రామా కాగా, ఈ సిరీస్ ను అప్పట్లో బిల్ గేట్స్ వరుస పెట్టి ఏకంగా నాలుగు సీజన్లను ఆపకుండా చూశానని చెప్పడం మరో విశేషం. మరి మీరు కూడా బిల్ గేట్స్ మెచ్చిన సిరీస్ లను చూడాలనుకుంటే వెంటనే ఓ లుక్కేసేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు