OTT Spy Movie : తండ్రి చావుపై హీరోయిన్ రివేంజ్…. అమ్మాయిలు ఇంత డేంజర్ గా ఉంటారా సామీ

OTT Spy Movie : చాలా వరకు సినిమాల్లో హీరోలే హీరోఇజం చూపిస్తూ ఉంటారు. అమ్మాయిలనే కారణంతో హీరోయిన్లకు ఇప్పటి వరకు ఇలాంటి ఛాన్స్ రాకపోవడం బాధాకరమే. ఇదే విషయాన్ని ఇప్పటిదాకా ఎంతో మంది హీరోయిన్లు చెప్పారు కూడా. వాళ్ళకు యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టాలి అని ఉన్నా దర్శకనిర్మాతలు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వరు అని. ప్రేక్షకులు ఆదరించే ఛాన్స్ ఉన్నా బిజినెస్ జరగదేమో అనే కారణం కూడా దీనికి ఒక కారణం. ఏదైతేనేం మన దర్శక నిర్మాతలు మాత్రం కేవలం హీరోలోనే హీరోయిజం చూస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఇండియన్ సినిమాను దాటితే హాలీవుడ్ లో హీరోయిన్లు కూడా హీరోలతో సమంగా ఫైట్ చేస్తారు, అలాగే సినిమాలను కూడా నడిపిస్తారు. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ చూశాక అమ్మాయిలు ఇంత డేంజర్ గా ఉంటారా సామీ అనే డౌట్ రాకమనదు. మరి ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? అసలు స్టోరీ ఏంటి ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ కంప్లీట్ గా ఒక రివేంజ్ యాక్షన్ డ్రామా. నిజానికి ఇప్పటివరకు ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన ఎన్నో సినిమాలను చూసాం మనం. కానీ ఈ మూవీలో మాత్రం కొత్తగా ఉంటుంది. ఈ మూవీ పేరు ట్రిగ్గర్ వార్నింగ్. జూన్ 21 నుంచి దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లోని టాప్ టెన్ సినిమాల్లో టాప్ 8 లో ట్రెండింగ్  అవుతుండడం విశేషం. ఈ సినిమాలో హాలీవుడ్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ప్రధాన పాత్రను పోషించింది. లేడీ ఓరియంటెడ్ సినిమా అయినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది.

Jessica Alba's Trigger Warning gets a release date alongside a first look  at her getting revenge on a violent gang

- Advertisement -

స్టోరీ ఏంటంటే…

సినిమా స్టార్టింగే హీరోయిన్ తండ్రి చనిపోతాడు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్న హీరోయిన్ ఆ తర్వాత తండ్రి మరణం గురించి ఆరా తీస్తుంది. నిజానికి హీరోయిన్ ఒక అమెరికన్ సీక్రెట్ ఏజెన్సీలో స్పైగా పని చేస్తుంది. ఆపరేషన్ అలైస్ 116 అనే మిషన్ ను విజయవంతంగా పూర్తి చేశాకే హీరోయిన్ కి తన తండ్రి చనిపోయాడని ఫోన్ వస్తుంది. అక్కడికెళ్లి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత హీరోయిన్ కి ఆయనది యాక్సిడెంట్ అని చెప్తారు. కానీ ఇది యాక్సిడెంట్ కాదు సూసైడ్ అని ఆమె ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెప్తాడు. అయితే ముందుగా హీరోయిన్ ఈ విషయాన్ని నమ్మదు కానీ ఆ తర్వాత ఆరా తీస్తే హత్య అని తెలుస్తుంది. దీంతో తన తండ్రిని హత్య చేసే అవసరం ఎవరికి ఉంది? అసలు ఆయనను ఎందుకు చంపారు? ఎవరు చంపారు? తండ్రిని చంపిన వ్యక్తులపై ఆమె ఏ రకంగా రివేంజ్ తీర్చుకుంది? అనే ఇంట్రెస్టింగ్ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ట్రిగ్గర్ వార్నింగ్ అనే ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు