OTT Suspense Movie: ష్… శబ్దం చేశారో చచ్చారే… వింతజీవుల చేతిలో చావు కన్ఫర్మ్

OTT Suspense Movie : హారర్ సస్పెన్స్ కలగలిపి ఉన్న సినిమాలను చూడడానికి ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా ఈ జానర్ సినిమాలు వస్తున్నాయి అంటే ఎలాంటి భయం లేకుండా ఒంటరిగా కూర్చుని చూసి ఆ థ్రిల్ ను ఫీల్ అవుతున్నారు మూవీ లవర్స్. ఇక హారర్ మూవీ అనగానే దయ్యాలు ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీలో మాత్రం వింత జంతువులు శబ్దం చేస్తే చాలు చీల్చి పారేస్తాయి. పొరపాటున శబ్దం చేసినా ఆ వింత జీవుల చేతిలో చావు కన్ఫామ్ అన్నట్టే ఉంటుంది. మరి ఇలాంటి సినిమాలు ఒంటరిగా, అది కూడా అర్ధరాత్రి చూశారంటే భయంతో రాత్రంతా నిద్ర పట్టడం కష్టమే మరి. ఇంతకీ ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? దాని పేరేంటి? అంటే…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ పేరు ది సైలెన్స్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీకి అప్పట్లో థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా, సస్పెన్స్ హారర్ మూవీ లవర్స్ కు ఫేవరెట్ గా మారింది. అయితే నిజానికి ఇదొక హాలీవుడ్ మూవీ. సైలెన్స్ అనగానే సైలెంట్ గా ఉంటుంది అనుకుంటున్నారేమో ఇదొక మోస్ట్ వైలెంట్ మూవీ. ఇక భాష ఏదైనా పర్లేదు చూసేద్దాం అనుకుంటే ఈ హర్రర్ మూవీ ని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే.

ది సైలెన్స్ మూవీ స్టోరీ ఏంటంటే…

800 అడుగుల లోతున ఓ గుహను ఓ రీసెర్చ్ టీం జరిగే పరిణామాలు తెలియకుండా పగలగొట్టేస్తారు. అలా చేసే టైంలో ఆ గుహ నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ తర్వాత వెస్ప్ అనే కొన్ని వింత జీవులు బయటకు వచ్చి ఆ రీసెర్చ్ టీం ను అత్యంత దారుణంగా చంపేస్తాయి. ఇక ఆ తర్వాత ఎక్కడ శబ్దం వినిపించినా ఆ గుహలో నుంచి బయట ప్రపంచంలోకి వచ్చేస్తాయి.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే అల్లి అనే ఒక ఫ్యామిలీ ఓ ఇంట్లో నివసిస్తూ ఉంటారు. అల్లి అమ్మమ్మకు క్యాన్సర్ ఉంటుంది. కానీ వెస్ప్ అనే జీవులు శబ్దం వస్తే చాలు అందరిని చంపేస్తూ ఉండడంతో అక్కడి ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో లాక్ డౌన్ ప్రకటిస్తుంది. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని కోరుతుంది. దీంతో శబ్దం పెద్దగా ఉండని ప్రాంతానికి వెళ్దామని అలీ ఫ్యామిలీ డిసైడ్ అవుతుంది. మొత్తం ఫ్యామిలీని తీసుకుని అతను బయలుదేరుతాడు.

కానీ అనుకోకుండా దారిలో వాళ్ళ కార్ హైజాక్ అవుతుంది. దీంతో ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ ఫ్యామిలీ అంతా అక్కడి నుంచి తప్పించుకొని దగ్గర్లో ఉన్న ఇంటికి వెళ్లి తల దాచుకుంటారు. కానీ వెస్ప్ గురించి తెలియక ఆమె గట్టిగటిగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె సౌండ్ విన్న ఆ వింత జంతువులు వెంటనే వచ్చి చంపేస్తాయి. మరి ఇంతకీ అల్లి ఫ్యామిలీ ఈ వెస్ప్ అనే జీవుల నుంచి ఎలా తప్పించుకుంది? ఫ్యామిలీ అంతా కలిసి బ్రతికి బయటపడడానికి ఎంతటి దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు ? అనే విషయం తెలియాలంటే మూవీని చూసి తీరాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు