OTT thriller Movie : శవంతో బిర్యానీ… నెవర్ బిఫోర్ మలయాళ క్రైం థ్రిల్లర్

OTT thriller Movie : ఇటీవల కాలంలో భారతీయ సినిమా ఇండస్ట్రీలో మలయాళ చిత్ర పరిశ్రమ హవా ఎక్కువైంది. వాస్తవికతకు, సహజత్వానికి దగ్గరగా ఉండే కథలతో అన్ని భాషల మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నారు మలయాళ మేకర్స్. ఇటీవల కాలంలో వచ్చిన ప్రేమలు, భ్రమయుగం, మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం సినిమాలు దీనికి ఉదాహరణ. ఈ ఏడాది మొదట్లోనే ఈ సినిమాలు భారీ ఆదరణను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే మలయాళ ఇండస్ట్రీ నుంచి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అప్పటిదాకా తాము సెలెక్ట్ చేసుకున్న క్రేజీ ప్లే లిస్ట్ ను పక్కన పడేసి ఈ సినిమాలకే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా మలయాళ సినిమాలను పిచ్చిగా చూసే వాళ్ళ కోసమే ఈ క్రేజీ మూవీ సజెషన్. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూవీ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ కూడా ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతుంది. మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ క్రైం థ్రిల్లర్ సినిమాలో షౌభిన్ షబీర్, జూడ్ ఆంటోని జోసెఫ్, సుధీర్ కోప్రా, గిరీష్ మోహన్, రాజేష్ కుమార్, జినేష్ చంద్రన్, జితు అశోక్ ప్రధాన పాత్రలు పోషించగా, షాహి కబీర్ ఈ మూవీని తెరకెక్కించారు. రెండేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి మూవీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ఎలా వీసా పూంచిర. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Elaveezhapoonchira (2022) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

- Advertisement -

కథలోకి వెళ్తే…

మధు అనే పోలీస్ కానిస్టేబుల్ చుట్టూనే స్టోరీ మొత్తం తిరుగుతుంది. ఈ కానిస్టేబుల్ కు శవానికి కాపలా కాయాల్సిన డ్యూటీని వేస్తారు అధికారులు. అయితే అక్కడ రక్తం మరకలు చూసి తట్టుకోలేక వేరే పోలీస్ ఆఫీసర్ తో కలిసి మందు కొడతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లగా అక్కడ వెంకయ్య అనే వ్యక్తి వంట చేసి పెడతాడు. కానీ ఈ కానిస్టేబుల్ తినకుండా దాన్ని కుక్కలకు పెడతాడు. కాసేపటి తర్వాత తన పై ఆఫీసర్ భార్య పిల్లలు కలిసి ఆ ప్రాంతాన్ని చూడడానికి వస్తారు. కానీ అందులో ఒక అబ్బాయి ఏదో మర్చిపోయానంటూ ఇంటికి వెళ్తాడు. అంతలోనే భారీ వర్షం స్టార్ట్ అవ్వడంతో మధు వాళ్ళని తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. ఈ క్రమంలోనే ఇంటికి వెళ్ళిన అబ్బాయి పిడుగు పడి చనిపోతాడు. ఇంకోవైపు సిటీలో పలుచోట్ల అమ్మాయిల బాడీ పార్ట్స్ దొరకడం ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకీ ఆ హత్యలు చేసింది ఎవరు? ఆ బాడీ పార్ట్స్ దొరికిన మృతదేహాలు ఎవరెవరివి? అనే ఇంట్రెస్టింగ్ విషయం తెలియాలంటే ఈ మలయాళ సినిమాపై ప్రైమ్ వీడియోలో లుక్ వేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు