OTT Movie : పరువు కోసం ప్రెగ్నెంట్ కూతురిని హత్య చేసే కసాయి తండ్రి… బుర్ర పాడు చేసే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలో అప్పుడప్పుడు ఆంథాలజీ సిరీస్ లు కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఇందులో నాలుగు ఐదు స్టోరీలను ఒక్కో ఎపిసోడ్ లో చెప్తారు. అందులోనూ ఒక్క కథ ఒక్కో జానర్ కు సంబంధించి ఉంటుంది. అందుకే ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచే స్టోరీలలో ఆంథాలజీ సిరీస్ లు కూడా ఉంటాయి. ఇక ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ సజెషన్ కూడా ఆంథాలజీ సిరిసే. మరి ఈ సిరీస్ ఏ ఓటిటిలో అందుబాటులో ఉంది? దాంట్లో ఉన్న స్టోరీస్ ఏంటి? అనే విషయంపై ఓ లుకేద్దాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో…

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్లో సాయి పల్లవి, ప్రకాష్ రాజ్, అంజలి, సిమ్రాన్, కల్కి, గౌతమ్ మీనన్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు స్టోరీలు ఉంటాయి. అయితే అన్నీ కూడా పరువు కు సంబంధించిన కథలు కావడం విశేషం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

స్టోరీ లోకి వెళ్తే….

Paava Kadhaigal: Season 1 | Rotten Tomatoes

- Advertisement -

ముందుగా నా బంగారం అనే స్టోరీ మొదలవుతుంది. అందులో ఓ పల్లెటూరి అబ్బాయి తనకు అమ్మాయి లక్షణాలు ఉన్నాయని గుర్తించి, అమ్మాయిలా మారడానికి ఆపరేషన్ చేయించుకుంటాడు. ఆ తర్వాత తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనే ఆశతో ఊరికి తిరిగి వస్తాడు. అతనికి ఊర్లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అతని తన కుటుంబం యాక్సెప్ట్ చేసిందా లేదా? అనేది నా బంగారం స్టోరీ.

సెకండ్ స్టోరీ వాళ్లను ప్రేమించుకొనీ… ఈ స్టోరీలో ఇద్దరు ట్విన్స్ ఉంటారు. అయితే తండ్రికి భయపడి ప్రేమ విషయాన్ని చెప్పడానికి ఆలోచిస్తారు. ట్విన్స్ లో ఒకరైన ఆదిలక్ష్మి ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్తే కులం అంటూ ఆమెను చంపేస్తారు. దీంతో జ్యోతిలక్ష్మి మాత్రం తన లవ్ గురించి ఇంట్లో చెప్పకుండా తాను ఒక లెస్బియన్ అని చెప్తుంది. మరి ఆమె పరిస్థితి ఏమైంది? ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేది స్టోరీ.

ఇక మూడో స్టోరీ విషయానికి వస్తే దీని టైటిల్ దివి కుమార్తె. సత్యం, ఆది అనే దంపతులు 20 ఏళ్లుగా సంతోషంగా ఉండే జంట. వాళ్లకి ముగ్గురు పిల్లలు ఉంటారు. హ్యాపీ లైఫ్ అనుకునే లోపే వాళ్ళ చిన్న పాపపై అత్యాచారం జరుగుతుంది. ఊహించని ఈ సంఘటనతో ఆ కుటుంబం పరిస్థితి ఎలా మారింది? అన్నదే స్టోరీ.

నాలుగో స్టోరీలోకి వెళ్తే టైటిల్ ఆ రాత్రి. ఇందులో సుమతి లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది. తండ్రికి చెప్పకుండానే పెళ్లి చేసుకుని భర్తతో కలిసి ఉంటుంది. అప్పటికే ఆమె ప్రెగ్నెంట్ అయ్యి, డెలివరీ టైం దగ్గర పడుతున్న సమయంలో తండ్రి వెతుక్కుంటూ వస్తాడు. ఇంకేముంది అంతా హ్యాపీ అనుకునే లోపే ఆ తండ్రి పరువు కోసం కడుపుతో ఉన్న కన్న కూతురిని చంపడానికి కూడా ఆలోచించడు. మరి అతను కూతుర్ని చంపేశాడా? చివరికి ఏమైంది? అనే విషయం తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న పాప కథైగల్ అనే ఈ సిరీస్ పై ఓ లుక్ వేయండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు