Unstoppable 2 : ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌ర‌వుతాడా ?

నంద‌మూరి న‌టసింహం బాల‌య్య హోస్ట్‌గా అన్‌స్టాప‌బుల్ టాకీ షో భార‌త‌దేశంలోనే ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం విధిత‌మే. మొద‌టి సీజ‌న్ ఆహా ఓటీటీలో రికార్డు స్థాయి వ్యూస్ రాబ‌ట్టింది. ఓటీటీ రంగంలో ఆహా దూసుకుపోవ‌డానికి అన్‌స్టాప‌బుల్ ప్ర‌ధాన కార‌ణ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టివ‌ర‌కు న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా కొన‌సాగిన బాల‌య్య ఈ షోతో త‌న‌లో ఉన్న‌టువంటి మ‌రో కోణాన్ని చూపించాడు.

హోస్ట్ గా బాల‌య్య సెల‌బ్రిటీల‌ను అద్భుతంగా ఇంట‌ర్వ్యూలు చేయ‌డం మాత్ర‌మే కాదు.. కాంట్ర‌వ‌ర్సి ప్రశ్న‌ల‌ను కామెడీ వేసి అద్భుత‌మైన స‌మాధానాలు రాబ‌ట్టేవాళ్లు. అన్‌స్టాప‌బుల్ అక్టోబ‌ర్ 14న స్ట్రీమింగ్ కానున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించింది. దీనికి దెబ్బ‌కి థింకింగ్ మారిపోవాలి అనే ట్యాగ్ లైన్ కూడా జ‌త‌చేసింది.

ఇక ఈసీజ‌న్‌లో మొట్ట‌మొద‌టిసారిగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు రానున్నార‌ట‌. ఇప్ప‌టికే బాల‌య్య‌-చంద్ర‌బాబు మ‌ధ్య షూటింగ్ కూడా పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. ఇక రెండో ఎపిసోడ్‌కి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రానున్న‌ట్టు స‌మాచారం. అన్‌స్టాప‌బుల్ 2 ఎపిసోడ్ మొత్తం పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌ను ఇంట‌ర్వ్యూ చేయ‌నున్నారా అనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఓవైపు చంద్ర‌బాబు, మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రి మూడో ఎపిసోడ్ లో ఎవ‌రినీ ఆహ్వానిస్తారో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు