Prasanna Vadanam on OTT : ప్రసన్న వదనం మూవీ ఓటిటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Prasanna Vadanam on OTT : మట్టి స్టార్ సుహాస్ నటించిన తాజా సస్పెన్స్ థ్రిల్లర్ ప్రసన్న వదనం మూవీ ఈరోజె థియేటర్లోకి వచ్చింది. ఇలా థియేటర్లలోకి వచ్చిందో లేదో ఓటిటి లో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు మూవీ లవర్స్. మరి ప్రసన్న వదనం మూవీ ఎప్పుడు ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుహాస్ ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ తో దూసుకెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన సుహాస్ హీరోగా మారాక డిఫరెంట్ జానర్ కంటెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంటున్నాడు. హిట్ 2 సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన సుహాస్ హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి ఈరోజు ప్రసన్న వదనం మూవీతో థియేటర్లలోకి వచ్చేసాడు.

సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుండగా ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి చర్చ మొదలైంది. ప్రసన్న వదనం మూవీ ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడు? ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ రాబోతోంది అనే విషయాన్ని ఆరా తీస్తున్నారు సుహాస్ ఫ్యాన్స్. కాగా ప్రసన్న వదనం మూవీ ఓటిటి రైట్స్ ను పాపులర్ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు గడిచాకే ఓటీటీలో రాబోతోందని సమాచారం. దీన్ని బట్టి లెక్కేస్తే మే లాస్ట్ వీక్ లేదా జూన్ ఫస్ట్ వీక్ లో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.

- Advertisement -

హ్యాట్రిక్ హిట్ దక్కినట్టేనా?

ప్రసన్న వదనం మూవీలో సుహాస్ హీరోగా, రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే దర్శకత్వం వహించగా, లిటిల్ థాట్స్ సినిమాస్ బ్యానర్ పై మణికంఠ జెఎస్, ప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. హర్ష చెముడు, నందు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తోంది. మరి మూవీ హిట్ అవుతుందా ? అంటే మరి కొంత సమయం వెయిట్ చేయాలి. ఇప్పటికే సుహాస్ రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలతో రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మూవీ కూడా కమర్షియల్ గా హిట్ అయితే సుహాస్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడినట్టే. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

సుహాస్ పై ఆహా స్పెషల్ ఇంటరెస్ట్

ఇదిలా ఉండగా సుహాస్ నటించిన గత రెండు సినిమాలు కూడా ఆహా లోనే స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతుండడం విశేషం. కలర్ ఫోటో, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలు ఇప్పటికే ఆహాలో అందుబాటులో ఉండగా, ఇప్పుడు ప్రసన్న వదనం మూవీని కూడా ఆహానే స్ట్రీమింగ్ చేయబోతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు