Pushpa-2 : ఓటీటీ కోసం చర్చలు

అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా పుష్ప ది రూల్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప ది రైజ్ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా పుష్ప మేనియా జనాల్లో ఉంది. దీంతో పుష్ప సీక్వెల్ పై అంచనాల రోజు రోజుకు పెరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం ఎదురుచూసే ప్రేక్షకుల సంఖ్య కూడా పెరుగుతుంది. అయితే పుష్ప ది రూల్ కు ఇంకా సమయం పట్టేలా ఉంది. ఆగస్టు, లేదా సెప్టెంబర్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు.

కానీ, ఇటీవల అల్లు అర్జున్ హెయిర్ లుక్ చూస్తే అది కష్టమే అని తెలుస్తుంది. పుష్ప ది రూల్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు.. కానీ, అప్పుడే ఈ సినిమా ఓటీటీకి రిలీజ్ కు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. పుష్ప ది రూల్ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం నిర్మాతలు అప్పుడే చర్చలు ప్రారంభించారట.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ తో పుష్ప ది రూల్ టీం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తుంది. పుష్ప బ్లాక్ బస్టర్ తో పుష్ప ది రూల్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో ఓటీటీ హక్కులపై పోటీ కాస్త ఎక్కువగానే ఉంది. ఖచ్చితంగా భారీ ధరకే పుష్ప ఓటీటీ హక్కులు ఉంటాయని చెప్పొచ్చు. పుష్ప మేకర్స్ ను సంతృప్తి పరిచేలా నెట్ ఫ్లిక్స్ డీల్ చేసుకుంటుందా, లేదా మరో ఓటీటీ ప్లాట్ ఫాం రంగంలోకి దిగుతుందా అని తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు