Sabari OTT: స్ట్రీమింగ్ కి సిద్ధమైన వరలక్ష్మీ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..!

Sabari OTT: కోలీవుడ్, టాలీవుడ్ లో ఎలాంటి పాత్రలోనైనా నటించగలిగేటువంటి అతి కొద్ది మంది హీరోయిన్లలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఒకరు.. అయితే ఈ మధ్యకాలంలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా కంటే విలన్ గా కీలకమైన పాత్రలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ భారీ క్రేజ్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ ఓరియెంటెడ్ సినిమాగా నటించిన చిత్రం శబరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ కార్జ్ట్ తెరకెక్కించారు. ఈ చిత్రం మొత్తం సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కించడం జరిగింది.

పోస్టర్లతోనే ఆసక్తిని పెంచిన శబరి..

టీజర్, ట్రైలర్ , పోస్టర్ల తోనే ఈ సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేసింది చిత్ర బృందం. ఇందులో శశాంక్ కీలకమైన పాత్రలో నటించారు. మే మూడవ తేదీన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. అంతేకాకుండా ఈ సినిమాకి పోటీగా చాలా సినిమాలు విడుదలవ్వడంతో ఈ సినిమాకు కాస్త మైనస్ గా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శబరి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ నటన మాత్రం మరొకసారి నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెటిజన్ లు సైతం ప్రశంసలు కురిపించారు.. ఈ సినిమా కథలోని ట్విస్టులు కూడా అందరిని ఆకట్టుకున్నట్లు తెలియజేశారు.

జూన్ 14 నుంచీ ఓటీటీ లోకి..

Sabari OTT: Varalakshmi psychological thriller movie ready for streaming..!
Sabari OTT: Varalakshmi psychological thriller movie ready for streaming..!

ఇలా థియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న వరలక్ష్మి శబరి సినిమా ఇప్పుడు ఏకంగా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో శబరి సినిమా స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. ఈనెల 14వ తేదీన ఈ సినిమా ఓటీటీ లోకి రాబోతోంది.. ఈ చిత్రం అన్ని భాషలలో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శబరి ఓటీటీ సినిమా రిలీజ్ పై న ఇంకా అధికారికంగా అమెజాన్ స్పందించలేదు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నది.

- Advertisement -

శబరి మూవీ కథ:

ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. వరలక్ష్మి శరత్ కుమార్ – సంజనఅనే పాత్రలో నటించింది.. ఇందులో ఈమె పెద్దలను కాదని అరవింద్ అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంటుంది.. అయితే ఆ తర్వాత అరవింద్ జీవితంలో ఇంకో అమ్మాయి ఉందని నిజం తెలుసుకున్న తర్వాత తన కూతురుతో కలిసి దూరంగా జీవిస్తూ ఉంటుంది.. అలా జీవనం కోసం జుంబా ట్రైనర్ గా కూడా చేరుతుంది. సంజన కోసం సూర్య క్రిమినల్(మైమ్ గోపి) చాలా వెతుకుతూ ఉంటారు.. ఈ విషయం తెలుసుకున్న సంజన పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా ఇందులో అతను చనిపోయినట్లుగా తెలుస్తుంది.. అసలు సూర్య ఎవరు? అతను సంజన కోసం ఎందుకు వెతుకుతున్నారు? తన భర్త నుంచి తన కూతురు రియా ను ఎలా కాపాడుకున్నది ? అనే కథాంశమే ఈ శబరి సినిమా కథ అన్నట్టుగా తెలుస్తోంది. మరి థియేటర్లో పర్వాలేదు అనిపించుకున్న శబరి మూవీ ఓటీటీ లో ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు