Shankar: వారం రోజుల్లో ఓటిటి , శంకర్ సినిమాకి ఏంటి పరిస్థితి

Shankar: హాలీవుడ్ సినిమా మీద అవగాహన లేకముందు, వరల్డ్ సినిమా అంటే ఏంటో తెలియక ముందు. సౌత్ ఇండస్ట్రీలో గ్రాండ్ ఫిలిం మేకర్ అంటే కేవలం వినిపించే ఏకైక పేరు శంకర్. జెంటిల్మెన్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన శంకర్ ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందించాడు. ఇప్పుడు అంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అని అనుకుంటున్నారు కానీ ఒకప్పుడు శంకర్ తెరకెక్కించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండేవి. చాలామంది శంకర్ ని ఇన్స్పైర్గా తీసుకొని సినిమాలు చేయడం మొదలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలామంది దర్శకులు కూడా ఇప్పటికీ శంకర్ కి ఫ్యాన్స్.

శంకర్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాడు. దాంట్లో ఇండియన్ సినిమా ఒకటి. కమల్ హాసన్ నటించిన ఈ సినిమా ఒకప్పుడు సంచలనం. ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం. శంకర్ ఎంచుకున్న కాన్సెప్ట్. సేనాపతి క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఇవన్నీ కూడా సినిమాకు మంచి ప్లస్ గా నిలిచాయి. శంకర్ కెరియర్ లో తీసిన బెస్ట్ సినిమాల ప్రస్తావన వస్తే దానిలో కచ్చితంగా వినిపించే పేరు ఇండియన్. ఇదే సినిమా తెలుగులో కూడా భారతీయుడు పేరుతో డబ్బింగ్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరించారు.

Indian 2

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా సినిమా రాబోతుంది అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది విపరీతమైన అంచనాలను పెట్టుకున్నారు. దాదాపు ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రీసెంట్ గా జులై 12న థియేటర్లో విడుదలైంది. అయితే కొంతమంది తమిళ్ యంగ్ ఫిలిం మేకర్స్ ఈ సినిమాను పొగిడినా కూడా, చాలామంది తమిళ్ ఆడియన్స్ కు తెలుగు ఆడియన్స్ కు ఈ సినిమా నచ్చలేదు. ఈ సినిమాను అనవసరంగా తెరకెక్కించారు. సీక్వెల్ కూడా అనవసరం అని చాలామంది కామెంట్ చేశారు. శంకర్ స్థాయి తెలియని చాలామంది శంకర్ ను ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.

ఇక ఈ సినిమా మరో వారం రోజుల్లో నెట్ ఫ్లెక్స్ లో విడుదల కానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, భాషల్లో ఈ సినిమా అవైలబుల్ గా ఉంటుంది. ఈ నెల 12న రిలీజ్ అయిన ఈ సినిమా అతి తక్కువ రోజుల్లో ఓటిపి కి రావడం అనేది శంకర్ అభిమానులకు, కమల్ అభిమానులకు కొంచెం బాధాకరమైన విషయం అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు