Si-Fi Movie on OTT : ఆకాశాన్ని చూస్తే చావే… వెన్నులో వణుకు పుట్టించే ఈ మూవీ ఏ ఓటిటిలో ఉందంటే?

Si-Fi Movie on OTT : హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ల తర్వాత ఓటిటిలో మంచి డిమాండ్ ఉండే సినిమాలు అంటే సైన్స్ ఫిక్షన్ స్టోరీలే. ఇలాంటి సినిమాలు చూడాలంటే కాస్త మైండ్ పెట్టి తీరాల్సిందే. ఫ్రీగా ఉన్నప్పుడు ఫ్రెష్ మైండ్ తో సైన్స్ ఫిక్షన్ సినిమాలను చూస్తే వచ్చే కిక్కే వేరు. ఈరోజు ఓ ఫ్రెష్ కంటెంట్ తో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీని మన మూవీ సజెషన్ లో తీసుకొచ్చేసాం. మరి ఆ మూవీ కంటెంట్ ఏంటి? ఏ ఓటిటిలో చూడొచ్చు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

నీలాకాశం ఎంతో అందంగా ఉంటుంది. అందుకే కవులు దాన్నో అద్భుతంగా వర్ణిస్తారు. సినిమాల్లో, పాటల్లో కూడా ఆకాశానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. కానీ ఈ డైరెక్టర్ మాత్రం వేరే కోణంలో చూశాడు ఆకాశాన్ని. అందుకే ఆకాశం వైపు చూస్తే చాలు చావే అంటూ కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మూవీ పేరు నోప్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడేవారు మిస్ అవ్వకుండా చూడాల్సిన మస్ట్ వాచ్ మూవీ ఇది. సినిమా చూశాక తప్పకుండా వర్త్ వాచ్ మూవీ మావా అంటారు. అయితే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇదొక హాలీవుడ్ మూవీ. ఇలాంటి కొత్త కంటెంట్ ఇంకెక్కడ అందుబాటులో ఉంటుంది హాలీవుడ్ లో తప్ప.

Jordan Peele's Nope: Trailer, Release Date & Everything We Know So Far

- Advertisement -

కథ ఏంటంటే…

గుర్రాలను పెంచే ఓ ఫ్యామిలీ కాలిఫోర్నియాలోని చిన్న పల్లెటూరులో నివసిస్తుంది. హీరో పేరు ఓజే. అతనితో పాటే తండ్రి, చెల్లెలు కూడా ఉంటారు. ఇక తాము పెంచే గుర్రాలను సినిమాల షూటింగ్స్ కు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇలా సంపాదిస్తున్న ఆ ఫ్యామిలీకి ఓ రోజు సడన్ గా ఆకాశం నుంచి వింత శబ్దాలు వినిపిస్తాయి. తీరా చూస్తే ఆకాశం పైనుంచి నాణేల వర్షం కురుస్తుంది. వాటి దెబ్బకు ఓజె తండ్రి అక్కడికక్కడే చనిపోతాడు. దీంతో వ్యాపారం కూడా బాగా దెబ్బతింటుంది. చేతిలో చిల్లి గవ్వలేక, వాటిని తిండి పెట్టి మేపే పరిస్థితి లేక ఆ గుర్రాలను మరో వ్యక్తికి అమ్మేయాల్సి వస్తుంది. హీరో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు ఆకాశంలో వింత ఆకారాలను గమనిస్తారు జనాలు. అయితే పైకి చూసేవాళ్లకు ఆ ఆకారం సరిగ్గా కన్పించదు. కానీ చంపేస్తుంది. దీంతో ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు ఓజే. ఆ కనిపించని వింత ఆకారాలను ఫోటోలు తీసి మీడియాకు పంపిస్తే కావలసినంత డబ్బు వస్తుందని అనుకుంటాడు. అనుకున్నదే తడవుగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తాడు. మరి ఓజే ఆ వింత ఆకారాల్ని తన కెమెరాలో బంధించగలిగాడా ? అసలు ఆ వింత శబ్దాలు ఎందుకు వచ్చాయి ? చనిపోతున్న మనుషుల్ని ఆకాశం నుంచి ఊడిపడ్డ ఆ ఏలియన్సే చంపేసాయా ? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే నోప్ అనే ఈ  సినిమాను వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు