Tillu Square : “టిల్లు స్క్వేర్” ఓటిటి రైట్స్… సిద్దు కెరీర్లోనే హైయ్యెస్ట్ డీల్ ఇదే

టిల్లు గాని సందడి అప్పుడే మొదలైపోయింది. బిజినెస్ పరంగా మొదటి రికార్డు క్రియేట్ చేశాడు. “టిల్లు స్క్వేర్” ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ఇంకా నెల రోజులు ఉండగానే ఓటిటి రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ఇక తాజాగా జరిగిన డీల్ సిద్దు జొన్నలగడ్డ కెరీర్ లోనే హైయ్యెస్ట్ డీల్ అని తెలుస్తోంది. ఇంతకీ “టిల్లు స్క్వేర్” ఓటిటి రైట్స్ ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయి? ఏ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఈ రైట్స్ ను దక్కించుకుంది? అనే వివరాల్లోకి వెళితే…

ప్రస్తుతం టాలీవుడ్ లో సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా “టిల్లు స్క్వేర్” గురించే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా రూపొందిన లేటెస్ట్ మూవీ “టిల్లు స్క్వేర్”. 2022లో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “డీజే టిల్లు” మూవీకి సీక్వెల్ గా “టిల్లు స్క్వేర్” రాబోతోంది. మల్లిక్ రాం దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.

అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై బజ్ క్రియేట్ కాగా, తాజాగా వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ అయిన “టిల్లు స్క్వేర్” ట్రైలర్ వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ ట్రైలర్ లో సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ మధ్య ఉన్న ఘాటు లిప్ లాక్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాని ఫలితంగా సినిమాపై బజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ సినిమాకు యూత్ లో ఉన్న క్రేజ్ చూసి “టిల్లు స్క్వేర్” ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటిటీ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

- Advertisement -

“టిల్లు స్క్వేర్” డిజిటల్ రైట్స్ గురించి అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ తోపాటు సోనీ లివ్ మధ్య గట్టి పోటీ ఏర్పడిందని తెలుస్తోంది. ఈ భారీ పోటీ మధ్య నెట్ ఫ్లిక్స్ “టిల్లు స్క్వేర్” డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం. ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ డిజిటల్ రైట్స్ ను దాదాపు 35 కోట్లకు నెట్ ఫ్లిక్స్ కొనుక్కున్నట్టు టాక్. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం స్ట్రీమింగ్ రైట్స్ ను కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

ఇక సిద్దు జొన్నలగడ్డ కెరీర్లో ఇప్పటిదాకా ఇదే హైయ్యెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే “టిల్లు స్క్వేర్” థియేట్రికల్ కూడా ఫుల్ డిమాండ్ నెలకొందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఫలితంగానే సిద్దు జొన్నలగడ్డ కెరీర్లో హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే సినిమాలలో స్క్వేర్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా ఈ మూవీ మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు