Sit movie ott: ఈ సినిమా చివరిలో ట్విస్ట్ ఎవరు ఊహించలేరు..!

SIT Movie OTT.. ప్రస్తుతం ఉన్న కాలంలో చాలామంది ప్రేక్షకులు సైతం ఇతర జోన్లతో పోల్చుకుంటే ఎక్కువగా హర్రర్, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను చూడడానికే మక్కువ చూపుతున్నారు. ఇలాంటి చిత్రాలు థియేటర్లో కూడా భారీగానే సక్సెస్ అవుతూ కలెక్షన్లు సృష్టిస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు థియేటర్లో ఫ్లాప్ అయినా ఓటిటిలో మాత్రం అదరగొట్టేస్తున్నాయి. అందుకే చిన్న సినిమాలు సైతం డైరెక్ట్ గానే ఓటీటీ లో విడుదల చేసి ఆడియన్స్ ను థ్రిల్ కు గురి చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక సినిమా ఓటీటీ లో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఆ సినిమానే సిట్..

Zee -5 లో SIT స్ట్రీమింగ్..

SIT Movie OTT: Who can't guess the twist at the end of this movie..!
SIT Movie OTT: Who can’t guess the twist at the end of this movie..!

ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, నటాషా దోపి హీరో, హీరోయిన్స్ గా నటించారు.. ఈ చిత్రాన్ని విజయభాస్కర్ రెడ్డి డైరెక్షన్ చేశారు. మే 10వ తేదీన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో ఒకటైన..Zee -5 లో (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) సిట్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేశారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రీచ్ అయ్యిందని టాప్ ఫైవ్ లో కూడా ట్రెండ్ అవుతున్నట్లు మేకర్స్ ఇటీవలే తెలియజేశారు.. అలాగే రెండో పార్ట్ కోసం చాలామంది ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారని చిత్ర బృందం తెలియజేస్తోంది.

స్టోరీ..

సినిమా స్టోరీ విషయానికి వస్తే.. ఈ సినిమా మొత్తం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.. ఒక క్రైమ్ ను ఎలా సాల్వ్ చేశారు అన్నది ఈ సినిమాలో చాలా క్లియర్ గా చూపించారు. ముఖ్యంగా ఒక అమ్మాయి రేప్ మర్డర్ కేస్ ను ఎలా డీల్ చేశారు.. అనే కథాంశం తో తెరకెక్కించారు. ఈ సినిమా కథ మొత్తం సస్పెన్స్ థ్రిల్లర్, ట్విస్ట్ ఎలిమినేషన్ తో ఉన్నది. అయితే చివరిలో పోలీస్ అధికారి ఈ కేసులో ముద్దాయి అనే విషయం చివరి వరకు తెలియదు.ఇది ఈ సినిమాకి హైలెట్ అని కూడా చెప్పవచ్చు .

- Advertisement -

చివర్లో ట్విస్ట్ అదుర్స్..

మరి సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లను ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ సినిమా అయితే బాగా నచ్చుతుంది. ఈ సినిమా మొత్తం కూడా ట్విస్ట్ లతోనే కూడి ఉంటుంది. ఏది ఏమైనా సస్పెన్స్ థ్రిల్ కోసం ఎదురుచూసేవారు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. రేపు మర్డర్ కథాంశం చుట్టూ తిరిగే ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ముఖ్యంగా ఐ ఎం డి బి రేటింగ్ 8.4 రావడంతో సినిమాపై అందరూ ఆసక్తి పెంచుకుంటున్నారు మరి ఇప్పుడు ఓటీపీ లోకి కూడా వచ్చేసిన ఈ సినిమా ఎటువంటి రేటింగ్ ఇక్కడ అందుకుంటుందో చూడాలి మొత్తానికైతే 15 వేలకు పైగా ఆడియన్స్ ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం గమనార్హం. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ లో ప్రసారమవుతున్న నేపథ్యంలో ఎటువంటి రేటింగ్ సొంతం చేసుకుంటుంది.. ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నది చూడాలి. మొత్తానికైతే ఈ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది చిత్ర బృందం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు