SquidGame Season2 : ఓటిటి ప్రియుల్ని ఊరించిన సెన్సేషనల్ సిరీస్ మళ్లీ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

SquidGame Season2 : ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఈ మధ్య సినిమాలతో సమానంగా ఓటిటి వెబ్ సిరీస్ లకు ఇంపార్టెన్స్ పెరిగిపోయింది. గేమ్స్ అఫ్ థ్రోన్స్ తో ఓటిటి వెబ్ సిరీస్ లపై ఇంట్రస్ట్ పెరగగా, ఆ తర్వాత మనీ హైస్ట్, వంటి సిరీస్ లతో పీక్స్ కి చేరింది. అలాగే కరోనా లాక్ డౌన్ సమయంలో ఓటిటి ప్రేక్షకులని ఆకట్టుకున్న “సిరీస్ స్క్విడ్ గేమ్”. దిగ్గజ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో 2021 సెప్టెంబర్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. ముందుగా ఈ వెబ్ సిరీస్ వచ్చినపుడు పోస్టర్లు చూసిన వారు ఏదో కామెడీ థ్రిల్లర్ ఉండొచ్చని అనుకున్నారు. కానీ వెబ్ సిరీస్ చూస్తే మాత్రం ఒక్క సీన్ స్కిప్ చేయనివ్వకుండా ఉత్కంఠగా సాగుతుంది. ముందుగా కొరియన్ భాషలోనే విడుదలైన ఈ సిరీస్ ఆ తర్వాత ముప్పై కి పైగా భాషల్లో డబ్ అయి సెన్సేషనల్ హిట్ అయింది. ఇక ఇప్పుడు రెండో సీజన్లో అతి త్వరలో ప్రేక్షకులని అలరించడానికి మళ్ళీ వచ్చేస్తుంది.

SquidGame Season2 Releasing on December 26th 2024 at Netflix

సీజన్ 2 వచ్చేస్తుంది..

ఇక స్క్విడ్ గేమ్ సీజన్ ఎండ్ అయ్యాక రెండో సీజన్ పై ఆసక్తిని ఎంతో పెంచేశారు. కానీ ఇప్పటివరకు రాలేదు. అయితే ఫైనల్ గా ఎట్టకేలకి స్క్విడ్ గేమ్ సీజన్ 2 (SquidGame Season2) రిలీజ్ డేట్ ని ఇప్పుడు ఫిక్స్ చేసారు. కాసేపటి కింద నెట్ ఫ్లిక్స్ వారు ఈ సీజన్ పై అప్డేట్ ఇస్తూ.. ఒక ఇంట్రెస్టింగ్ టీజర్ వీడియోతో స్క్విడ్ గేమ్ రిలీజ్ డేట్ అప్డేట్ ఇచ్చారు. ఒక సింపుల్ టీజర్ లో గేమ్ ఆడుతున్న నటుల్ని చూపిస్తూ, ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ ఈ ఇయర్ అనగా 2024 డిసెంబర్ 26న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. పేదరికంలో ఉండి ఎన్నో అవసరాలు ఉన్న వ్యక్తులని, అలాగే డబ్బు అవసరం ఉన్న చాలామందిని, కిడ్నాప్ చేసి, గేమ్ ఆడితే డబ్బు ఇస్తామని చెప్పి, ఒక గ్యాంగ్.. గేమ్ పేరుతో ప్రాణాలు తీస్తూ, ముప్పు తిప్పలు పెడతారు. అన్ని అవాంతరాలు దాటుకుని హీరో ఏం చేసాడనేది ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తారు. మరి సెకండ్ సీజన్లో ఎలా చూపిస్తారో చూడాలి.

- Advertisement -

సీజన్ 3 కూడా…

అలా స్క్విడ్ గేమ్ సీజన్ 2 మాత్రమే కాదు సీజన్ 3 అప్డేట్ కూడా ఇచ్చారు. సీజన్ 3 వచ్చే 2025 లో విడుదల అవుతుందని అనౌన్స్ చేసారు. అలాగే ఆ 3వ సీజన్ చివరి సీజన్ అట. మరి ఎంతోమంది ఓటిటి వెబ్ సిరీస్ ప్రియులు ఎదురు చూస్తున్న స్క్విడ్ గేమ్ సిరీస్ సీజన్ 2 ఆడియన్స్ ని ఎలా అలరిస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు