The Akaali Review : ది అకాలి మూవీ రివ్యూ

The Akaali Review : మోస్ట్ బిజియెస్ట్ సీనియర్ యాక్టర్ నాజర్ ప్రధాన పాత్రలో నటించిన కోలీవుడ్ మూవీ ది అకాలి ఓటిటిలోకి వచ్చేసింది. మహమ్మద్ ఆసిఫ్ హామీద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జయకుమార్ జానకి రామన్, వినోద్ కిషన్, తలైవాసల్ విజయ్ కీలకపాత్రలు పోషించారు. మే నెలలో థియేటర్లో రిలీజై ఫర్వాలేదు అనే టాక్ ను తెచ్చుకున్న ఈ మూవీ జూలై 19 నుంచి ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ మూవీ ఓటిటి లవర్స్ ని మెప్పించిందా? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

కథ ఏంటంటే…

క్షుద్ర పూజలు, అతీత శక్తులను ఉపయోగించుకుని జానీస్ అనే అమ్మాయి వరసగా హత్యలు చేస్తుంది. ఆ మిస్టరీని చేదించడానికి హన్జా అనే పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. అయితే ఆయన ఈ కేసును టేకప్ చేసిన తర్వాత వరుసగా ఊహించని నిజాలు బయటపడతాయి. పోలీస్ ఆఫీసర్ అయిన హన్జా కంటికి కనిపించని శక్తుల నేపథ్యంలో సాగే హత్యలను ఎలా సాల్వ్ చేశాడు? జానీస్ ఎందుకు ఇలా అందరిని చంపుతుంది? కేసుని ఛేదించే క్రమంలో పోలీస్ ఆఫీసర్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ? హన్జా ఇన్వెస్టిగేషన్ లో బయటపడ్డ నిజాలేంటి ? అనే విషయం తెలియాలంటే ఈ మూవీని తెరపై వీక్షించాల్సిందే.

The Akaali 2024 Full Movie Online - Watch HD Movies on Airtel Xstream Play

- Advertisement -

విశ్లేషణ

సైతానును ఆరాధించి నరబలి ఇచ్చే సంఘటనలను దృష్టిలో ఉంచుకుని క్రైమ్ థ్రిల్లర్ తరహాలో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే దానికి సూపర్ నేచురల్ జానర్ ను కూడా జత చేయడం ప్రశంసనీయం. ఇలా రెండు జానర్లను కలిపి కథను కాస్త భిన్నంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆసక్తికరంగా కథను నడపడంలో డైరెక్టర్ తడబడ్డాడు. సినిమాలో డైరెక్షన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది డిఫరెంట్ ప్లాట్ అయినప్పటికీ దర్శకుడు క్యారీ చేసిన విధానంలో ఇంటెన్సిటీ చూపించగలిగారు. కొన్ని సన్నివేశాలు పదే పదే చూపించారు. అంచనాలతో సినిమా మొదలవుతుంది కానీ నిడివి చాలా ఎక్కువగా ఉండడం విసుగు తెప్పిస్తుంది. అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు కూడా బాగాలేవు. సినిమాలో చాలావరకు అనవసరమైన సన్నివేశాలు ఎక్కువగా చూపించాడు. కొన్ని సన్నివేశాలు అయితే అసలు సినిమా ఎటువైపు వెళ్తుందో అర్థంకాక గందరగోళంలఓ పడేస్తాయి. ఓవరాల్ గా ఇది డిఫరెంట్ ప్లాట్ అయినప్పటికీ దర్శకుడు క్యారీ చేసిన విధానం మాత్రం నిరాశ పరుస్తుంది.

సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ గా కన్పించిన జయకుమార్, నాజర్, తలైవాసల్ విజయ్, వినోదిని జయకుమార్ నటన బాగుంది. ఈ సినిమాలో వాడిన లొకేషన్లు, సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. మామూలుగా కాకుండా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కాస్త డిఫరెంట్ గా చేశారు. తోట ధరణి పనితనం సినిమా మొత్తం కనిపిస్తుంది. సినిమాలో సగం సన్నివేశాలు గ్రాఫిక్ అయినప్పటికీ తోట ఆర్ట్ డైరెక్షన్ కూడా అద్భుతంగా ఉంది.

ప్లస్ పాయింట్స్

నటీనటులు
ప్లాట్
నేపథ్య సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

సినిమా రన్ టైమ్
క్లైమాక్స్
అనవసరమైన సన్నివేశాలు

చివరగా

మొత్తం మీద క్రైమ్ అండ్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఓసారి చూడగలిగే సినిమా ది అకాలీ. కానీ అంచనాలు పెట్టుకుంటే మాత్రం చూడడం కష్టమే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు