OTT Movie : దిమాక్ కరాబ్ చేసే ట్రయాంగిల్ బో*ల్డ్ లవ్ స్టోరీ… ఏ ఓటిటీలో ఉందంటే?

OTT Movie :ఓటీటీలో బో*ల్డ్ కంటెంట్ తో కూడిన ఓ మంచి లవ్ స్టోరీని చూడాలి అనుకునే వారి కోసమే ఈరోజు మన మూవీస్ సజెషన్. ఈ సినిమా లవ్ స్టోరీ నే కానీ చాలా వింతగా ఉంటుంది. పైగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. దీనిని కేవలం లవ్ స్టోరీ గా చెప్పుకోలేము. ఎందుకంటే ఇందులో ఎమోషనల్ డ్రామా , అక్క తమ్ముళ్ల వింత అనుబంధం, ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇక బో*ల్డ్ మూవీ లవర్స్ ఇష్టపడే హాట్ సీన్స్ కూడా గట్టిగానే ఉన్నాయి. ఇది మాత్రమే కాదు యూత్ బాగా ఇష్టపడే స్టూడెంట్స్ పోరాటాలు కూడా ఈ మూవీలోనే ఉండడం విశేషం. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ చూడవచ్చు? అనే విషయాల్లోకి వెళ్తే..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో స్నేహానికి పెద్ద పీట వేస్తారు. అయితే వీళ్ళ మధ్య ఉన్న లవ్ స్టోరీనే అస్సలు అర్థం కాదు. చాలా వింతగా ఉంటుంది. కనీసం వీళ్ళు ఫ్రెండ్సా? లవర్సా? అనే విషయం సినిమా చూడడం మొత్తం పూర్తయితేనే గాని అర్థం కాదు. ఇక సినిమా మొత్తం ఒక అమెరికన్ అబ్బాయి తో పాటు, మరో అమ్మాయి అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఇది ఒక ఓల్డ్ మూవీ. కానీ స్టోరీ మాత్రం బాగుంటుంది.

Saltburn Owes Its Existence to 2003's The Dreamers

- Advertisement -

కథలోకి వెళ్తే…

1966 లో స్టూడెంట్స్ ఆందోళనలు, పోరాటాలు జరుగుతాయి. అదే టైంలో అమెరికన్ కుర్రాడు చదువుకోవడానికి పారిస్ వెళ్తాడు. ఆ టైంలో పారిస్ లో విద్యార్థులు ఓవైపు గొడవలు చేస్తుంటే, మరోవైపు ఈ కుర్రాడు చదువుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇంతలోనే ఈ అమెరికన్ కుర్రాడికి ఒక అబ్బాయి అమ్మాయి కలుస్తారు. వాళ్ళిద్దరూ ఇతన్ని చూడగానే బాగా మాట్లాడడంతో పాటు క్లోజ్ అవుతారు. అంతేకాకుండా ఏకంగా ఇంటికి తీసుకెళ్లి అక్కడే స్టే చేయొచ్చు అని చెప్తారు. ఇక ముందుగా ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ తాము ట్విన్స్ అని చెప్తారు. ఇలా తెలియని వాళ్ళ ఇంటికి వెళ్లిన ఈ అమెరికన్ కుర్రాడు వాళ్ళ ప్రవర్తన చూసి కంగారు పడతాడు. అయితే నువ్వేం భయపడొద్దు. ఇదంతా నిన్ను టెస్ట్ చేయడం కోసమే అంటుంది హీరోయిన్. కానీ కొన్ని రోజుల తర్వాత ఈ ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ తర్వాత ఈ కుర్రాడికి హీరోయిన్ పై ప్రేమ పుడుతుంది. ఆ తర్వాత స్టొరీ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. హీరోయిన్ అతడి ప్రేమని యాక్సెప్ట్ చేసిందా? అసలు వాళ్ళ మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనా? లేదా కేవలం అట్రాక్షన్ మాత్రమేనా? చివరికి వాళ్ళిద్దరూ ఒకటయ్యారా లేదా? అనే విషయాలు తెలియాలంటే ది డ్రీమర్స్ అనే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. అయితే సినిమాలో బో*ల్డ్ సన్నివేశాలు ఉంటాయి కాబట్టి సింగిల్ గా చూడడమే బెటర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు