OTT Movie : ప్రతీ పదేళ్లకు ఆ సైకో అరాచకం… చెమటలు పట్టించే సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : ఓటిటిలో రిలీజ్ అయ్యే సినిమాల్లో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఆదరిస్తూనే ఉంటారు. కొన్ని సినిమాలు చూపు తిప్పుకోకుండా వ్యూవర్స్ ని అలరిస్తూ ఉంటాయి. అందులోనూ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకుల మదిలో ఎప్పుడూ గుర్తుండిపోతాయి. అలాంటి సిరీస్ ఒకటి ఓటిటిలో స్ట్రీమ్ అవుతుంది. అనూహ్యమైన ట్విస్టులతో ఉండే ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో, స్టోరీ ఏమిటో తెలుసుకోవాలంటే ఓసారి ఈ మూవీ కథ లోకి వెళ్దాం.

3 reasons why The Sixth Sense is the perfect scary movie

ఈ మూవీ కధ లోకి వెళ్తే

ఒక డాక్టర్ సైకియాట్రిస్ట్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. అతని సేవలకు గాను ఆ డాక్టర్ కి బెస్ట్ సైకాలజిస్ట్ అవార్డు కూడా వస్తుంది. అనూహ్యంగా ఒకరోజు ఈ డాక్టర్ దగ్గరికి ఒక వింత పేషెంట్ వస్తాడు అతను డాక్టర్ కి నాకు చనిపోయిన వారంతా ఆత్మలుగా కనబడతారని చెప్తాడు. నాకు పది సంవత్సరాల క్రితం మీరు ట్రీట్మెంట్ చేశారని ఆ డాక్టర్ కి పేషెంట్ గుర్తు చేస్తాడు. అప్పుడు ఆ పేషెంట్ ని డాక్టర్ గుర్తు పట్టి అతను చెప్పేవన్నీ మానసిక లోపం వల్ల తనకు తానే ఊహించుకొని చెబుతున్నాడని డాక్టర్ గ్రహిస్తాడు. ట్రీట్మెంట్ అవసరం లేదని నమ్ముతూ పేషెంట్ ను తిరిగి పంపించేస్తాడు. కొంతకాలం తర్వాత ఆ పేషంట్ డాక్టర్ దగ్గరకు వచ్చి డాక్టర్ ను చంపి తనను కూడా కాల్చుకుంటాడు. ఈ సడన్ ట్విస్ట్ తో ప్రేక్షకులు తెరుకునే లోపే స్టోరీ ఊహించని మలుపులు తీసుకుంటుంది.

- Advertisement -

పది సంవత్సరాల తరువాత అచ్చం ఇలాగే ఒక కొత్త స్టోరీ మొదలవుతుంది. ఒక చిన్న పిల్లవాడికి కూడా ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. ఈ చిన్న పిల్ల వాడు చనిపోయిన పేషంట్ లాగే విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఈ పిల్లవాడి సమస్యను తెలుసుకోవడానికి ఒక డాక్టర్ తనని ఫాలో అవుతూ ఆ పిలాడిపైనే  ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాడు. ప్రతీక్షణం ఆ అబ్బాయి గురించే ఆలోచించడమే కాదు ఈ డాక్టర్ తన భార్యతో కూడా ఇదే విషయం గురించి చర్చిస్తూ వుంటాడు. ఆ పిల్లవాడి వింత ప్రవర్తన, చేసే పనులన్నీ చూసి అతని తల్లికి కూడా అనుమానం వస్తుంది. ఓ రోజు స్కూల్ కు వెళ్ళే టైమ్ లో రెడీ అవుతుంటాడు. అప్పుడు పిల్లాడిని గమనించిన తల్లి వాడిని చూసి తెగ టెన్షన్ పడుతుంది. మరి ప్రతి  డాక్టర్ 10 ఏళ్ళకు ఒకసారి రిపీట్ అవుతున్న ఈ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు? ఇంతకీ చనిపోయిన వ్యక్తికి ఆ కుర్రాడికి ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న సెవెన్త్ సెన్స్ అనే ఈ సినిమాపై ఓ లుక్కేయండి . ఉత్కంఠ భరితంగా సాగే ఈ మూవీ ప్రస్తుతం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ముఖ్యంగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను వెతుకుతున్న వారు ఈ వీకెండ్ ఈ సినిమాను చూడడం మరచిపోవద్దు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు