Crime thriller web series: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి టైటిల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Crime thriller web series: మహారాజ చిత్రంతో లాంగ్ గ్యాప్ అనంతరం బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి. రివేంజ్ డ్రామా గా రూపొందిన ఈ సినిమా ఐదు రోజుల్లో 32 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో 7.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్..3.75 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ దక్కించుకుంది.

ఇక తెలుగులోనూ బ్రేక్ ఈవెన్ ను దాటింది. ఇక మహారాజా అనంతరం తమిళంలో మూడు సినిమాలు చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ సేతుపతి. అదేవిధంగా ఓ వెబ్ సిరీస్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు మణికందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు విండ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు మహారాజా ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి వెల్లడించారు.

Title fix for Vijay Sethupathi's crime thriller web series
Title fix for Vijay Sethupathi’s crime thriller web series

ఈ సిరీస్ షూటింగ్ తుది దసకు చేరుకున్నట్లు విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. తొందర్లోనే టైటిల్ తో పాటు వెబ్ సిరీస్ రిలీజ్ డేట్ ని కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సిరీస్ ఆగస్టులో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు