Tollywood : ఒక్క సినిమాలేదు.. ఆ సిరీస్ పైనే అందరి కన్ను..

Tollywood : టాలీవుడ్ సహా పాన్ ఇండియా వైడ్ గా ఇప్పుడు కల్కి2898AD సినిమా హవానే నడుస్తోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ప్రీమియర్స్ నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కల్కి అన్ని భాషల్లో కూడా యానానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుని హౌస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఇప్పటికే 700 కోట్ల వరకు వసూలు చేసిన కల్కి వెయ్యి కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా కల్కి సినిమా వల్ల లాస్ట్ వీక్ దీనితో పోటీగా ఏ సినిమా కూడా రిలీజ్ కాలేదు. అది ముందే ఊహించారు ఆడియన్స్. అయితే కల్కి విడుదలై వారం రోజులు పూర్తవగా, ఈ వారం కూడా ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కావడం లేదు. ముఖ్యంగా తెలుగులో అయితే కల్కి థియేటర్లతో నిండిపోయింది. కల్కి ప్రభంజనం చూసి రావాల్సిన చిన్న సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అయితే సినిమాలు రాకపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ చూపు ఓ వెబ్ సిరీస్ పై పడింది.

Tollywood and Bollywood movie lovers are waiting for Mirzapur season 3

బూతు సిరీస్ పై మూవీ లవర్స్ కన్ను…

ఇక థియేటర్లలో ఈ వారం కూడా కల్కి హవానే నడుస్తుండడంతో ఓటిటి సినిమాలు ఏమైనా ఉన్నాయా అని మూవీ లవర్స్ వెతుకుతూ ఉన్నారు. అయితే ఓటిటి లో కూడా పెద్దగా కొత్త సినిమాలు రావడం లేదు గాని, ఒక క్రేజీ వెక్బ్ సిరీస్ మాత్రం అందరిలో ఆసక్తి పెంచుతుంది. ఆ సిరీస్ ఏదో కాదు. “మీర్జాపూర్ సీజన్3”. ఈ సిరీస్ లో వచ్చిన మొదటి రెండు పార్ట్ లు ఎంత పెద్ద సక్సెస్ అయ్యాయో తెలిసిందే. బూతు కంటెంట్ ఉందన్న విమర్శలు వచ్చినా ప్రేక్షకులు ఈ సినిమాకి ఎగబడిచూసారు. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కి సీక్వెల్ గా మూడో పార్ట్ వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ కి సాలిడ్ రెస్పాన్స్ రాగా, ఈ శుక్రవారం జూలై 5న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో సినిమాలు చూసే ఆడియన్స్ కి ఇంకా కల్కినే బెస్ట్ ఆప్షన్. కానీ ఓటిటి మూవీ కోసం ఎదురుచూస్తున్న ఆడియన్స్ కి ఫస్ట్ ఆప్షన్ గా మీర్జాపూర్ సీజన్3 నిలుస్తుంది.

- Advertisement -

సీజన్ 3 అంచనాలను అందుకుంటుందా?

ఇక టాలీవుడ్ (Tollywood) తో పాటు బాలీవుడ్ లో కూడా ఈ వారం పెద్దగా సినిమాలు రావడం లేదు. కాబట్టి మీర్జాపూర్ పై అందరి కన్ను పడింది. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో విపరీతమైన వైలెన్స్, బూతులు హద్దులు మీరిన సీన్స్ ఉన్నా యూత్ ఈ సినిమాకి ఎగబడుతున్నారు. అయితే మొదటి రెండు భాగాల్లో మెప్పించిన మున్నా భయ్యా రోల్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ పాత్ర సెకండ్ సీజన్లో చనిపోవడంతో మూడో సీజన్ ఆకట్టుకుంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా జులై 5నుండి స్ట్రీమింగ్ కాబోతున్న మీర్జాపూర్ ఎలాంటి అంచనాలను అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు