Top 10 Malayala Movies on OTT : మలయాళ మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే

Top 10 Malayala Movies on OTT : ఈ ఏడాది మలయాళ సినిమాలకు గోల్డెన్ టైం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ మూడు నెలల్లోనే వచ్చిన ప్రేమలు, మంజుమ్మెల్ బాయ్స్ వంటి కొన్ని కొత్త సినిమాలతో ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్లను చూసింది మలయాళ బాక్స్ ఆఫీస్. నిజానికి లాక్ డౌన్ అనంతరం ఓటీటీలకు బాగా ఆదరణ పెరిగింది. అదే సమయంలో అన్ని భాషల ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై మక్కువ ఎక్కువైంది. ఇక ఈ క్రమంలోనే మలయాళ మూవీ లవర్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలలు ఏంటో తెలుసుకుందాం.

1. ఉస్తాద్ హోటల్

దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ 2012లో రిలీజ్ అయింది. అంజలి మీనన్ దక్షకతంలో తెరకెక్కిన ఈ మూవీ చెఫ్ కావాలనుకున్న ఓ అబ్బాయి తన కలను ఎలా నెరవేర్చుకున్నాడు అనే లైన్ తో కొనసాగుతుంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు యూట్యూబ్లో కూడా ఉంది.

2. తట్టాతిన్ మారయత్తు

నివిన్ ఫాలి, ఇషా తల్వార్ జంటగా నటించిన ఈ మూవీ రెండు భిన్న మతాలకు చెందిన ప్రేమికుల స్టోరీతో నడుస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

- Advertisement -

3. బెంగళూరు డేస్

నజ్రియా, దుల్కర్ సల్మాన్, నివీన్ పాలి నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీకి అంజలి మీనన్ దర్శకత్వం వహించగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది.

4. ప్రేమమ్

నివిన్ పాలి, సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ఆల్ఫోన్స్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ తెలుగులో కూడా ఇదే టైటిల్ తో నాగ చైతన్య హీరోగా వచ్చింది. ఈ మలయాళ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

5. చార్లీ

మార్టిన్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ చార్లీ. దుల్కర్ సల్మాన్, పార్వతి జంటగా నటించిన ఈ మూవీ సన్ నెక్స్ట్ లో అవైలబుల్ గా ఉంది.

6. న్యాన్ ప్రకాశన్

ఫహద్ ఫాజిల్, శ్రీనివాసన్ నటించిన ఈ మూవీకి సత్యన్ దర్శకత్వం వహించారు. ఈ హిట్ మలయాళ మూవీ ప్రైమ్ వీడియోతో పాటు నెట్ ఫ్లిక్స్ లో కూడా స్ట్రిమింగ్ అవుతోంది.

7. కూడే

అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో నదియా, పృథ్వీరాజ్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించారు. అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే బంధం నేపథ్యంలో నడిచే ఈ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

8. కుంబలంగి నైట్స్

ఇందులో ఫహద్ ఫాజిల్, సౌబిన్ షాహిద్ ప్రధాన పాత్రలు పోషించారు. అన్నదమ్ముల సంఘర్షణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది.

9. హృదయం

ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్, దర్శన రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. మలయాళం నటుడు కం డైరెక్టర్ వినీత్ శ్రీనివాసన్ ఈ మూవీని రూపొందించారు. మ్యూజిక్ తో మాయ చేసిన ఈ మూవీ హాట్ స్టార్ లో అవైలబుల్ గా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు