Trending on OTT : టాప్ లో ట్రెండ్ అవుతున్న తెలుగు కామెడీ మూవీ… ఏ ఓటీటిలో చూడొచ్చు అంటే?

Trending on OTT : ఈవారం ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ సినిమాల్లో ఓ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ట్రెండింగ్ లిస్టులో టాప్ లో చోటు దక్కించుకుంది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ మూవీ ఓటిటిలో వ్యూస్ పరంగా దూసుకెళ్తోంది. ఆ మూవీ మరేదో కాదు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన గంగం గణేశా.

సైలెంట్ గా ఓటీటీలోకి…

ఓటిటిలో కంటెంట్ బాగుంటే క్రైం థ్రిల్లర్ సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది. థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికి ఈ సినిమాలు ఓటీటీలో మాత్రం దుమ్ము రేపుతుంటాయి. తాజాగా గంగం గణేశా విషయంలో కూడా అదే జరుగుతుంది. బొమ్మిశెట్టి ఉదయ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ డ్రామా ప్రస్తుతం భారీ సంఖ్యలో వ్యూస్ తో ఓటీడీలో సందడి చేస్తోంది. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ సరసన నయన్ సాగరిక, ప్రగతి శ్రీవాత్సవ హీరోయిన్లుగా నటించారు. ప్రిన్స్ యావర్, వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ కీలక పాత్రలలో కనిపించారు.

Gam Gam Ganesha OTT: ఓటీటీలోకి ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ మూవీ.. 'గం గం గణేశా'  స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే? - Telugu News | Anand Deverakonda's Gam Gam  Ganesha Movie likely To Stream ...

- Advertisement -

ఉదయ్ బొమ్మిశెట్టికి దర్శకుడిగా టాలీవుడ్ లో ఇదే మొదటి సినిమా కాగా, ఆయనతో పాటు వంశీ కారుమంచి కూడా నిర్మాతగా ఈ మూవీతో డెబ్యూ ఇచ్చారు. హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తన స్నేహితుడు కేదార్ సెలగం శెట్టితో కలిసి వంశీ కారుమంచి ఈ గంగం గణేశా మూవీని నిర్మించారు. యాక్షన్ అండ్ క్రైమ్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ మే 31న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే అదే టైంలో విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ హీరోగా చేసిన భజే వాయువేగం సినిమాలు రిలీజ్ కావడంతో ఆనంద్ దేవరకొండ సినిమాకు గట్టి పోటీ ఏర్పడింది. ఆ పోటీని తట్టుకోలేక గంగం గణేశా మూవీ డీలా పడింది. దీంతో డిజాస్టర్ గా నిలిచింది. అయితే ఈ మూవీ ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండానే జూన్ 20న సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది.

ట్రెండింగ్ లో ఆనంద్ దేవరకొండ మూవీ

దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో జూన్ 20 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్న గంగం గణేశా సినిమాకు ఓటిటీ మూవీ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఓటిటిలో రిలీజ్ అయినప్పటి నుంచి భారీ సంఖ్యలో వ్యూస్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ సినిమాల లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఈ లిస్ట్ లో ప్రస్తుతం గంగం గణేశా మూవీ మూడో స్థానంలో ఉంది. ఇక మొదటి స్థానంలో చాలా రోజుల నుంచి పంచాయత్ సీజన్ 3 కొనసాగుతోంది. రెండవ స్థానంలో రీసెంట్ గా రిలీజైన ది బాయ్స్ సీజన్ 3 ఉండడం విశేషం. ఇక గంగం గణేశ మూవీ థియేటర్లలో మూవీ లవర్స్ ను మెప్పించలేకపోయినా, కనీసం ఓటీటీ లవర్స్ ను అయినా ఆకట్టుకుంటోంది అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆనంద్ దేవరకొండ ఫ్యాన్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు