Brinda Web Series : బృంద పై క్రేజీ బజ్.. ఆ స్టార్ హీరోయిన్ తొలి వెబ్ సిరీస్…

Brinda : సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒకప్పుడు సౌత్ లో నెంబర్ వన్ హీరోయిన్ గా చక్రం తిప్పిన త్రిష కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయిన సంగతి తెలిసిందే. వరుస ఫెయిల్యూర్ వల్ల సినిమా ఛాన్సులు లేక ఇబ్బంది పడిన ఈ హీరోయిన్, లాట్ ఇయర్ పొన్నియిన్ సెల్వన్, లియో వంటి బ్లాక్ బస్టర్ హిట్లతో గాడిన పడింది. ఇప్పుడు వరుస ఆఫర్లతో తిరిగి టాప్ పొజిషన్ కి వస్తుంది. ప్రస్తుతం త్రిష చేతిలో ఏకంగా అరడజను సినిమాలు ఉండడం విశేషం. అందులో టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా త్రిష కృష్ణన్ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. బృంద పేరుతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీ అయింది.

Trisha's web series Brinda will be streaming on Sony Liv on August 2

అంచనాలు పెంచేసిన బృంద…

ఇక త్రిష కృష్ణన్ వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ అయినప్పటికీ మధ్యలో బృంద పేరుతో ఓ వెబ్ సిరీస్ లో నటించింది. త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కగా, త్రిష నటించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘బృంద’ కావడం విశేషం. ఇక ఈ వెబ్ సిరీస్ లో త్రిష మెయిన్ లీడ్ గా నటించగా, ఈ సినిమాలో ఇంద్రజిత్ సుకుమారన్, ఆమని, రవీంద్ర విజయ్, రాకేందు మౌళి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ ని కొల్లా ఆశిష్ నిర్మించగా, సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించాడు. తాజాగా బృంద వెబ్ సిరీస్ టీజర్ రిలీజ్ కాగా, మంచి రెస్పాన్స్ తెచ్చుకుని అంచనాలని పెంచేసింది. ఇక ఈ సిరీస్ లో త్రిష పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుందని టీజర్ చూస్తూనే తెలుస్తుంది. ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బృంద వెబ్ సిరీస్ టీజర్ లో కథకి సంబంధించిన హింట్ అయితే ఇవ్వలేదు. కానీ వెబ్ సిరీస్ పై ఆసక్తి పెంచింది.

- Advertisement -

స్ట్రీమింగ్ కి రెడీ అయిన బృంద..

ఇక త్రిష కృష్ణన్ నటించిన బృంద వెబ్ సిరీస్ ని ప్రముఖ ఓటిటి ఛానెల్ అయిన సోని లివ్ లో ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. బృంద సిరీస్ తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవనున్నట్టు తెలుస్తుంది. మరి సినిమాల్లో ఆడియన్స్ ని అద్భుతంగా మెప్పించిన త్రిష తన మొదటి వెబ్ సిరీస్ తో, అది కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పిస్తుందో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ లో ఉన్న త్రిష, ఆ వెంటనే అజిత్ సినిమాలో కూడా నటిస్తుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు