Veeranjaneyulu ViharaYatra : బేబీ దొరికేసినట్టుంది.. రిలీజ్ అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు!

Veeranjaneyulu ViharaYatra : టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే మొన్న ఆయన ఓ వీడియో రిలీజ్ చేసి మా బేబీ కనిపించట్లేదు సార్.. నాగ్ అశ్విన్ గారూ మీకేమైనా తెలుసా? తెలిస్తే మాకు దొరికేలా చేయండి సార్.. అంటూ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి నాగ్ అశ్విన్ రిప్లై కూడా ఇస్తూ.. అయ్యో నాగేశ్వరరావు గారూ.. డోంట్ వర్రీ సార్.. మా బుజ్జి ఫ్యాన్స్ సహాయంతో బేబీ ని తప్పకుండా వెతికి ఇస్తాం అని రిప్లై ఇచ్చాడు. దీంతో చాలా మందికి ఏంటిది అసలు నరేష్ ఎందుకు ఇలాంటి వీడియో చేసాడు. ఎవరు ఇంతకీ ఆ బేబీ అని సెర్చ్ చేస్తే అసలు విషయం తెలిసింది. బేబీ అంటే నరేష్ నడిపే కార్ పేరు అని. అది కూడా రియల్ లైఫ్ లో కాదు. ఆయన నటించిన కొత్త సినిమాలో కార్ పేరు బేబీ.

Veeranjaneyulu ViharaYatra Movie Releasing on 15th August on ETV Win OTT

బేబీ కథేంటి?

అసలు విషయానికి వస్తే.. సీనియ‌ర్ నటుడు న‌రేష్, బ్రహ్మానందం ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన తెలుగు కామెడీ మూవీ “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర” (Veeranjaneyulu ViharaYatra). ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంది. భామ‌ క‌లాపం వెబ్ సిరీస్ నిర్మించిన నిర్మాత‌లు బాపినీడు, సుధీర్ ఈద‌ర క‌లిసి “వీరాంజ‌నేయులు విహార‌యాత్ర” పేరుతో ఓ కామెడీ మూవీని నిర్మించడం జరిగింది. ఈ సినిమాతో సుధీర్ పుల్ల‌ట్ల ద‌ర్శ‌కుడిగా పరిచయం కాబోతున్నాడు. సీనియ‌ర్ నటుడు న‌రేష్, బ్ర‌హ్మానందం ప్ర‌ధాన పాత్ర‌లు పోషించగా, కీడాకోలా ఫేమ్ రాగ్‌ మ‌యూర్‌, ప్రియా వ‌డ్ల‌మాని హీరో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమాలో నరేష్ పేరు నాగేశ్వరరావు కాగా, అయన నడిపే వాహనం పేరు “బేబీ”. సినిమాలో చాలా వరకు కథ దానిపైనే ఉంటుందట. సినిమా గోవా టూర్ నేపథ్యంలో సాగుతుందని టాక్. అందుకే వాళ్ళ బేబీ తప్పుపోయిందని మొన్న నాగ్ అశ్విన్ సాయంతో వైరల్ చేసారు.

- Advertisement -

బేబీ దొరికేసింది.. రిలీజ్ అనౌన్స్ మెంట్ చేసారు..

ఇక నరేష్ అలా బేబీ గురించి ప్రమోట్ చేయగానే బాగా వైరల్ అయింది. ఇక బేబీ దొరికిందో ఏమో మరి.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు మేకర్స్. ఇక అయన నటించిన ‘వీరాంజనేయులు విహారయాత్ర’ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. ఈ సినిమాను ఆగష్టు 14న ఈటీవీ విన్ ఓటిటి లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసారు. గోవా టూర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఫన్ & కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. మరి వీరాంజనేయులు విహారయాత్ర ఆడియన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు