Thangalaan OTT : రెండు నెలల తర్వాత ఓటీటీలోకి విక్రమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Thangalaan OTT : తమిళ్ స్టార్ హీరోయిన్ చియాన్ విక్రమ్ లేటెస్ట్ గా నటించిన మూవీ తంగలాన్.. పా రంజిత్ దర్శకత్వంలో ఈ మూవీ ఆగస్టు 15 కానుకగా విడుదలైంది. మొదటి రోజే మంచి టాక్ ను అందుకుంది. కలెక్షన్స్ ను కూడా భారీగానే అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఓటీటీ అప్డేట్ ను తాజాగా మేకర్స్ వదిలారు..

అదిరిపోయే విజువల్స్‌, మ్యూజిక్‌తో పాటు యాక్షన్ అంశాలను బాగున్నాయని ఆడియెన్స్‌ చెబుతోన్నారు. తొలిరోజు తంగలాన్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. విక్రమ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. విక్రమ్‌తో పాటు పార్వతికి నేషనల్ అవార్డు తప్పకుండా వస్తుందని చెబుతున్నారు ఆమె ఫ్యాన్స్. అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ తో రెండో రోజు కూడా దూసుకుపోతుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్స్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

Vikram movie in OTT after two months.. Where is the streaming?
Vikram movie in OTT after two months.. Where is the streaming?

తాజాగా ఈ మూవీ భారీ ధరకు ఓటీటీ పార్ట్నర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. తెలుగు, తమిళంతో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి 35 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ తంగలాన్ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ మూవీ ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన రాబోతుందని సమాచారం.

- Advertisement -

ఈ మూవీ కథ విషయానికొస్తే.. యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా దర్శకుడు పా రంజిత్ ఈ మూవీని తెరకెక్కించాడు. తంగలాన్ కథ మొత్తం 1850 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. వేప్పూరుకు చెందిన గిరిజన నాయకుడు తంగలాన్ సంతోషంగా ఉండటం ఆ ఊరి జమిందారికి నచ్చలేదు. పన్ను కట్టలేదని హింసించేవాడు. కథాగమనం చాలా నెమ్మదిగా సాగడమే కాకుండా సెకండాఫ్‌లో దర్శకుడు కథను క్లారిటీగా చెప్పకుండా ఆడియెన్స్‌ను కన్ఫ్యూజ్ చేశాడని అంటున్నారు. తంగలాన్ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. రూ. 150 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీ తెరకేక్కిందని తెలిసిందే.. మరి ఎన్ని కోట్లను రాబడుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు