Bharateeyudu3 : డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్లో ‘భారతీయుడు 3’?

Bharateeyudu3 : కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్లో రూపొందిన ‘భారతీయుడు 2’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూలై 12 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోకే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ‘గో బ్యాక్ ఇండియన్’ అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఈ సినిమాని విపరీతంగా ట్రోల్ చేశారు నెటిజెన్లు. 1996 లో వచ్చిన ‘ఇండియన్’ సినిమాని ఏ దశలోనూ మ్యాచ్ చేసే విధంగా ఈ సీక్వెల్ లేదని అంతా ముక్తకంఠంతో చెప్పారు.

వాస్తవానికి మరీ అంత దారుణంగా అయితే ‘భారతీయుడు 2’ లేదు. ఒకసారి చూసే విధంగానే ఉంది. శంకర్ సినిమాల్లో ఆకట్టుకునే విజువల్స్ ఇందులోనూ ఉన్నాయి. మొదటి సాంగ్ రిచ్ గా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. సెట్స్ కూడా అదే విధంగా కాస్ట్ లీ గా కనిపించాయి. స్క్రీన్ ప్లేలో హైస్ అయితే లేవు కానీ అక్కడక్కడా మెప్పించే సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యాక కచ్చితంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Will Bharateeyudu3 movie be released directly on Amazon OTT?

- Advertisement -

సరే..ఏదేమైనా స్క్రిప్ట్ లోపం వల్లనే ‘భారతీయుడు 2’ తేడా కొట్టింది. అది బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ పై కూడా ప్రభావం చూపింది. తెలుగులో కాస్త పర్వాలేదు అనిపించే విధంగా ఓపెనింగ్స్ వచ్చాయి.కానీ తమిళంలో, హిందీలో, మలయాళంలో.. అత్యంత ఘోరమైన ఓపెనింగ్స్ నమోదయ్యాయి. నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో 60 శాతం రికవరీ జరిగింది. థియేట్రికల్ గా ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని తేలిపోయింది.

‘మరి ఇలాంటి పరిస్థితుల్లో ‘భారతీయుడు 3′ (Bharateeyudu3) వస్తుందా?’ ఇప్పుడు చాలా మందిని వెంటాడుతున్న ప్రశ్న ఇదే..! ఒకవేళ షూటింగ్ కనుక మొదలుపెట్టకపోతే కచ్చితంగా మేకర్స్ వెనకడుగు వేసేవారు. అందులో సందేహం అవసరం లేదు. కానీ ‘భారతీయుడు 3’ షూటింగ్ 70 శాతం పూర్తయిపోయింది, 2025 ఆరంభంలో ఈ సినిమాని రిలీజ్ చేస్తామని దర్శకుడు శంకర్ చెప్పకనే చెప్పాడు.అలాగే విషయమంతా పార్ట్ 3 లోనే ఉంది అని ‘భారతీయుడు 2’ క్లైమాక్స్ లో గ్లింప్స్ ద్వారా స్పష్టం చేశారు.

అయితే ‘భారతీయుడు 3’ థియేటర్లలో రిలీజ్ చేయాలంటే బయ్యర్స్ ముందుకు రావాలి కదా..? కాబట్టి.. ఇప్పుడు మేకర్స్ ముందు 2 మార్గాలు ఉన్నాయి. బ్యాలన్స్ షూటింగ్ ఫినిష్ చేసి నేరుగా ‘భారతీయుడు 3’ ని ఓటీటీకి ఇచ్చేయాలి. లేదు అంటే ‘భారతీయుడు 2’ వల్ల నష్టపోయిన బయ్యర్స్ కి నష్టపరిహారంగా ఇచ్చేయాలి.ఇవి రెండు కూడా టీంకి ఉన్న అడ్వాంటేజ్..లు అనే చెప్పాలి. అప్పుడు ‘భారతీయుడు 3’ హిట్ టాక్ సంపాదించుకుని వసూళ్లు రాబడితే పర్వాలేదు. లేదు అంటే వసూళ్లు రావు. కాబట్టి.. కాన్ఫిడెన్స్ ఉంటేనే ‘భారతీయుడు 3’ ని థియేటర్లకు వదలాలి. లేదు అంటే అమెజాన్ ప్రైమ్ వంటి వాటికి ‘పే పెర్ వ్యూ’ పద్దతిలో ఇచ్చేసి.. ‘భారతీయుడు 2’ నష్టాల్ని తీర్చేస్తే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు.

అయితే తెలుగులో ఒక సినిమా ప్లాప్ అయితే సీక్వెల్ ఎందుకు అనేవాళ్ళు ఉంటారు… ఉన్నారు కూడా..! కానీ హాలీవుడ్లో ఒక సీక్వెల్ ప్లాపైనా ఇంకో సీక్వెల్ వచ్చి సక్సెస్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దానిని దృష్టిలో పెట్టుకుని శంకర్ ముందడుగు వేస్తే ‘భారతీయుడు 3’ ని థియేటర్లలో చూసే ఛాన్స్ కూడా మనకి లేకపోలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు